తెలంగాణ విద్యార్థుల సమస్యల మీద అలుపెరుగని పోరాటాలు చేస్తున్న వైస్సార్ సిపి యువనేత

0
200

ఎప్పుడైతే కెసిఆర్ గారు తెలంగాణ కోసం దీక్ష చేశాడో అప్పటి నుంచి సమైక్య తెలుగు రాష్ట్రంలో రాజకీయ అనిశ్చితి వచ్చిందని చెప్పొచ్చు. ఉద్యమ సెగలో భారీ ఇమేజ్ ఉన్న చిరంజీవి ఒక వర్గం ప్రజలకు దూరమై చివరికి కాంగ్రెస్ లో పార్టీని కలిపేసాడు. టీడీపీ లాంటి పార్టీ రెండు కళ్ళ సిద్ధాంతం పేరుతొ రాజకీయాలు చేసి చివరికి ఎన్నికల సమయంలో పవన్,మోడీల ఛరిష్మాలతో ఆంధ్రాలో అధికారం వచ్చింది. ఇక కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రాలో ఇటు తెలంగాణాలో మట్టికరిచిపోయింది.

ఇలా కాంగ్రెస్ లాగానే వైస్సార్ పార్టీకి కూడా దురదృష్టం వెంటాడి చివరికి స్వల్ప తేడాతో ఆంధ్రాలో అధికారం కోల్పోయింది.
వైస్సార్ పార్టీలో తెలంగాణాలో పిల్లర్ లు ఉన్న కొండా దంపతులు ,బాజిరెడ్డి గోవర్ధన్ లాంటి నాయకులు తెరాస తీర్థం పుచ్చికొని ఎమ్మెల్యేలు గా కావటం ఎన్నికల సమయంలో దాదాపు పార్టీ ఒంటరి పోరాటం చేసిందని అని చెప్పొచ్చు.
వైస్సార్ పార్టీ సమైక్య పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చినా కూడా తెలంగాణ లో ఖమ్మం లాంటి ఎంపీ సీట్ గెలిచి తన హవాను చాటి కార్యకర్తలకు ఆత్మస్థయిర్యం ఇచ్చిందని చెప్పొచ్చు. ఐతే ఎన్నికల తర్వాత రెండు రాష్ట్రాల్లో అధికారపార్టీలు ఫిరాహింపు కార్యక్రమాలను ప్రోత్సహించటంతో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెరాసలోకి జంప్ అయ్యారు. దానితోపార్టీకి తెలంగాణాలో పెద్ద దిక్కుగా ఉన్న పొంగులేటి వెళ్లిపోవటంతో తెలంగాణ లో పార్టీ పని అయిపోయిందని ఇటు కార్యకర్తలు అటు ప్రజలు కూడ అభిప్రాయపడ్డారు. అంతే కాకుండా హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో పార్టీ దూరం ఉండటంతో వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర పార్టీ అని ముద్ర పడిపోయింది. నిజానికి వైస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ,జగన్ ని ఇష్టపడేవాళ్లు తెలంగాణాలో ఎక్కువగానే ఉన్నా కూడా నడిపించే నాయకుడు లేకపోవటంతో ఎడ్లు ఉండి ,నాగలి ఉండి దున్నే రైతు లేక వ్యవసాయం మూలకు పడ్డట్టు అయ్యింది.

కాని తెలంగాణ కొత్త పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డి గారికి పార్టీ పగ్గాలు ఇచ్చినా తెలంగాణాలో పెద్దగా కార్యాచరణ కనిపించటం లేదు అని అనుకుంటున్న తరుణంలో అయన నాయకత్వం చాప కిందా నీరులా పనిచేస్తుందని తెలుస్తుంది. ప్రధానంగా అయన టీంలో వైస్సార్ సిపి స్టూడెంట్ వింగ్ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు బత్తుల నాని గారి నాయకత్వం చాల పటిష్టంగా కనిపిస్తుంది. హైద్రాబాద్ లో ఏ సమస్య వచ్చినా కూడా తన టాలెంట్ తో,వ్యూహాత్మకంగా పాత క్యాడరును,పాత నాయకులను కలుపుకుంటు పనిచేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. ప్రధానంగా విద్యార్థుల సమస్యలను ,వైస్సార్ గారు ప్రవేశపెట్టిన ఫీజు రీ అంబర్స్మెంట్ పథకం సరిగ్గా అమలు కావాలని పోరాటం ,అనుమతి లేని కాలేజీలను రద్దు చేయలని ధర్నాలు ,వేసవిలో ఇంటర్ తరగతుల నిర్వహించడంపై ఇంటర్ బోర్డు పైన చేసిన విభిన్నమైన పోరాటాలు చూసి జనాల్లో మళ్ళి వైస్సార్సీపీ పైన దృష్టి మరలుతుంది అనటంలో సందేహం లేదు.

హైదరాబాద్ వాసి అయిన యువనేత బత్తుల నాని ఎంతో మంది కార్యకర్తలకు ,సైలెంట్ గా ఉన్న నాయకులకు స్పూర్తినిస్తూ తన ఇద్దరి బాసుల నుంచి మార్కులు సంపాదిస్తూ భవిష్యత్తులో తెలంగాణ లో వైస్సార్సీపీ ఆశలను కలుగచేస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here