-
ఉధ్యమమే ఊపిరిగా ….. ఉధ్యమమే స్వాసగా… ఉధ్యమమే లక్ష్యంగా…… ఉధ్యమమే జీవితంగా పూర్తి కమీట్మంట్ తో పొరాడిన అతి కొద్ది మంది తెలంగాణ ఉద్యమ కారుల్లో స్వామి వివేక్ పటేల్ ఆకుల ఒకరు.
ఒక మద్య తరగతి కుటుంబంలో పుట్టి JNTU-H లాంటి అత్యున్నత విద్యాసంస్థల్లో M. Tech. వంటి ఉన్నత విద్యనభ్యసించి, యుక్త వయసులోనే జయశంకర్, కాళోజీ, బాపూజీ ల స్పూర్తినోంది, భూపతి లాంటి వారి అడుగుజాడల్లో స్వరాష్ట్ర సిద్దే కాంక్షగా తన జీవితాన్ని, తన బంగారు భవిష్యత్తును బంగారు తెలంగాణా కోసం పణంగా పెట్టి తానే ఒక సమిధనై నేను సైతం మీతో అంటూ ఎంతో మంది యువతకు భరోసా ఇస్తున్న మన తెలంగాణా ముద్దు బిడ్డ, తెలంగాణా పోరాటంతో పాటు భావి బంగారు తెలంగాణాల తనకంటూ ఒక ప్రత్యేకతను చాటి చెప్పుకొంటూ తెలంగాణ ఉద్యమకారుడుగా సుపరిచితుడైన స్వామి వివేక్ పటేల్ పుట్టిన రోజు సంబురాలను ఘనంగా నిర్వహించారు.