-
భారత దేశం లో నూతనంగా ఏర్పడి అత్యుత్తమ పథకాలను అమలు చేస్తూ తెలంగాణ రాష్ట్రం దేశం లోనే గొప్ప రాష్ట్రంగా పేరు తెచ్చుకుంటుంది. అభివృద్ధి పథకాలు ప్రజల మన్ననలను పొందుతూ రాష్ట్ర చరిత్రలోనే అద్భుత ఫలితాలను పొందుతుంది. ఉపాధి హామీలో తెలంగాణ రాష్ర్టానికి ఐదు జాతీయ అవార్డులు వచ్చాయి. ఈ అవార్డుల ప్రధానోత్సవం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది.
పారదర్శకత, జవాబుదారీతనంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి భవన్ సాఫ్ట్వేర్ ద్వారా అన్లైన్లో నిక్షిప్తం చేసినందుకు ఉమ్మడి వరంగల్ జిల్లాకు, యువతకు ఉపాధి శిక్షణ, ఉద్యోగకల్పనకు గాను ఈజీఎంఎంకు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన అవార్డు , ఎక్కువ మంది కూలీలకు పని కల్పించిన మనోహరాబాద్ గ్రామానికి, ఉత్తమ గ్రామపంచాయతీగా నిజామాబాద్ జిల్లా జాక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ గ్రామానికి, నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి తపాలశాఖ ఉద్యోగి అబ్దుల్ సత్తార్‌కు అవార్డులు ప్రధానం చేసారు.