తెలుగు సహచరులపైనా తెలంగాణ స్కూల్ క్రికెటర్ల భారీ విజయం

0
1238

జాతీయ స్కూల్ క్రికెట్ పోటీల్లో తెలంగాణ జట్టుకి ఎదురు లేకుండా పోయింది. నిన్న తమిళనాడు జట్టుపైన హోరాహోరీగా మ్యాచులో తెలంగాణ గెలిస్తే ఈ రోజు తమ తెలుగు సహచరులు ఆంధ్రప్రదేశ్ పైన గెలిచింది. స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా ,జాతీయ స్కూల్ క్రికెట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ పోటీల్లో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ జట్టులు తలపడ్డాయి. గెలిచి మొదట బాటింగ్ చేసిన తెలంగాణ 19 ఓవర్లలో 105 పరుగులు అల్ అవుట్ అవగా,రోహన్ 24 పరుగులు చేసాడు. తర్వాత బాటింగ్ చేసిన ఆంధ్ర 7 ఓవర్లలో 22 పరుగులకు అల్ అవుట్ అయ్యారు. తెలంగాణ మీడియం ఫేసర్ అంకుర్ సింగ్ 3.3 ఓవర్లలో 5 పరుగులిచ్చి 8 వికెట్స్ తీసి ఆంధ్ర ప్రదేశ్ ని కుప్పకూల్చాడు. దీనితో తెలంగాణ క్వార్టర్ ఫైనల్లో అడుగుపెట్టింది. మాన్ అఫ్ ది మ్యాచ్ గా అంకుర్ సింగ్ ఎంపికయ్యాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here