చిరు-పవన్ కలయికని మించిపోయేలా ఆర్మూర్ బహిరంగసభకు క్రేజ్…

0
2076

 

తెలుగు సినిమా ప్రేక్షకుల్లో కొన్ని కంబినేషన్లో సినిమాలు వచ్చిన లేక వాళ్లిద్దరూ ఒకే వేదికను పంచుకున్నా క్రేజ్ మాములూగా ఉండదు. ముఖ్యంగా చిరు-పవన్ ల సినిమా వస్తే ప్రేక్షకులకు విందు వినోదాలు దొరికిపోతాయి . సినిమా కాంబినేషన్ సెట్ అవ్వటం అంత సులువు కాదు కాబట్టి  కనీసం వాళ్లిదరు కలిసి వేదిక పంచుకుంటే ఫాన్స్ కి పెద్ద పండుగ అనేది సత్యం. ఆలా ఇప్పటి వరకు వాళ్లిద్దరూ షేర్ చేసుకున్న ఫంక్షన్లు అందరిని అలరించాయి. మొదట్లో వాళ్లిద్దరూ కలిసి చాల ఆడియో ఫంక్షన్లకు వచ్ఛే వారు. కాని రాజకీయ విభేదాల కారణంగా గత 5 ఏళ్లుగా వాళ్ళ కలయిక తగ్గిపోయింది. వీళ్ళ కలయికకు క్రేజ్ ఎందుకు వచ్చిందని ఒకసారి చూస్తే ఇద్దరు సూపర్ స్టార్లు కావటం ,తర్వాత అన్నతమ్ములు కావటం వలన ఇద్దరి అభిమానులు ఒకే వేదిక మీద చూడాలని కోరుకుంటున్నారు. ఐతే ఇపుడు నిజామాబాదు జిల్లా ఆర్మూర్ పట్టణంలో జరిగే భహిరంగ సభకు కూడా ఇలాంటి క్రేజ్ వచ్చింది.

 

వివరాల్లోకి వెళితే ఈ నెల 6వ తారీఖున తెలంగాణ ఐటి ,మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఆర్మూరులో భహిరంగ సభలో పాల్గొననున్నారు. ఐతే ఈ సభ కి ఒక విశేషం ఉంది. మొట్టమొదటి సారిగా కేటీఆర్ ,అయన సోదరీమణి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత లు ఒక బహిరంగ వేదిక పైన ప్రసంగించనున్నారు. ఏంటి వాళ్లిద్దరు ఇప్పటివరకు ఒకే సభలో పాల్గొనలేదా అనే డౌట్ రావొచ్చు. నిజానికి వాళ్లిద్దరూ కలిసి ఒక వేదికపైకి రావటం ఇదే తొలిసారి. ఎందుకంటే ప్రోటోకాల్ పరంగా కూడా ఆ అవసరం రాకపోవటం ,కేటీఆర్ గారు ఎక్కువ హైదరాబాద్ సభల్లో ,కార్పొరేట్ సభల్లో పాల్గొనటం,కవిత గారేమో తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితం అవ్వటం వలన కుదరలేదు. ఐతే ఇపుడు కేటీఆర్ గారు తన మున్సిపల్ శాఖ అధికారిక కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు మొదటిసారి ఒక సభకు వెళ్తున్నారు. ప్రోటోకాల్ పరంగా కవిత గారు ఆ సభలో పాల్గొంటారు కాబట్టి అన్నాచెల్లెలికి మొదటిసారి ఒక బహిరంగ సభలో పాల్గొనే అవకాశం వచ్చింది.

ఈ వేదికలో వాళ్ళు ఏం మాట్లాడుతారో అని అటు మీడియాకి ,తెరాస అభిమానులకు ,ఇందూర్ జిల్లా వాసులకు ఆసక్తి ఎక్కువైంది. ఇప్పటికే తెలంగాణ లో ఉన్న ప్రతిపక్ష నాయకులకు విడివిడిగా దీటుగా సమాదానాలు ఇస్తున్న కేటీఆర్ ,కవితలు ,వీళ్లిద్దరు కలిసి ఏం మాట్లాడబోతున్నారో అని ఇతర పార్టీల వాళ్ళు కూడా ఈ సభ గురుంచి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు సమాచారం. ఇక తెరాస అభిమానులు మాత్రం ఒక ముందడుగు వేసి సోషల్ మీడియాలో తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈ సభలో 30000 మందికి పైగా జనాలు సభలో పాల్గొననున్నారని సమాచారం

Author:Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here