పాలమూరు ఐ.టీ పార్క్ లో ఐ.టీ కంపెనీలు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి

0
29

పాలమూరు ఐ.టీ పార్క్ లో ఐ.టీ కంపెనీలు పెట్టేందుకు ఎన్నారైల ఆసక్తి

విదేశాల్లో స్థిరపడిన దేశీయ నిపుణులు,వ్యాపారవేత్తలు తిరిగి స్వదేశానికి చేరుకునే వాతావరణాన్ని కల్పించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు. మహబూబ్‌నగర్‌కు తలమానికమైన ఐటీ, ఇండస్ట్రియల్‌ మల్టీపర్పస్‌ కారిడార్‌ లో పెట్టుబడులే లక్ష్యంగా మలేసియా, సింగపూర్ దేశాలలో పర్యటిస్తున్న ఆయనకు తెలంగాణ సింగపూర్ కల్చరల్ సొసైటీ కార్యవర్గ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వారితో పలు విషయాలపై చర్చించారు. రాష్ట్రంలో ఐటీ పరిశ్రమను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం క్రియాశీల విధాన చర్యలు చేపట్టిందని, ఇందుకోసం పలు నిర్దిష్టమైన విధానాలు తెచ్చిందని వారికి వివరించారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.

సమైక్యాంధ్ర రాష్ట్రంలో పాలమూరు అంటేనే వలసల జిల్లాగా ఉండేదని, ఇక్కడి నుండి రాష్ట్రంలోని ఇతర జిల్లాలకే కాకుండా దేశంలోని చాలా ప్రాంతాలకు కూలీలుగా వలస వెళ్లేవారు, కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ గారు మహబూబ్‌నగర్‌ పై ప్రత్యేక దృష్టి పెట్టి జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్తున్నారు. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం నుండి 45నిమిషాల వ్యవధిలో చేరేలా ఇటీవలే మహబూబ్‌నగర్‌ లో పురపాలిక పరిధిలోని ఎదిర శివారులో 500 ఎకరాలలో ఐటీ టవర్, మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశామని, ఇందులో పెట్టుబడులు పెట్టాలని మంత్రి ఎన్నారైలకు పిలుపునిచ్చారు. ఐటీ పార్కు ఏర్పాటు ద్వారా స్థానికంగా 50వేల పైచిలుకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పారు. యువత మెట్రో నగరాలకు వలస వెళ్లే అవసరం లేకుండా ఆ స్థాయి ఐటీ ఉద్యోగాన్ని స్థానికంగానే ఉంటూ చేసుకునేందుకు చక్కటి అవకాశం ఐటీ పార్క్ ఏర్పాటు ద్వారా దక్కనుందన్నారు. ఐటీ పార్కు లో కంపెనీలను స్థాపించే వారికి అన్ని రకాల రాయితీలను, అదనపు ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం కల్పిస్తుందన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ప్రజలుకు అనేక సంక్షేమ పథకాలను అమలు పరుస్తూ దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నామన్నారు. దేశంలోని అనేక రాష్ట్రాల వారు మన పథకాలను చూసి వారి రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారన్నారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కోసం ఇంతగా మనసుపెట్టి పనిచేసే సిఎం దేశంలో కేవలం సీఎం కెసిఆర్ మాత్రమే ఉన్నారన్నారు.

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం అనేక వ్యాపార అవకాశాలు ఉన్నాయని, వినూత్నమైన పాలసీలతో ముందుకు సాగుతున్నామని, రాష్ట్ర యువనేత, ఐ.టి శాఖ మంత్రి కేటీఆర్ గారి నాయకత్వంలో ఐ.టి లో రాష్ట్రం ముందుందన్నారు. తెలంగాణ రాష్ట్రం టిఐపాస్, టి-హబ్ లాంటి విప్లవాత్మకమైన విధానాలతో పెట్టుబడులను ఆకర్షించడంలో అగ్రస్థానంలో ఉందని తెలిపారు. టిఐపాస్ ద్వారా శిక్షణ ఇచ్చి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే కార్యక్రమం కేవలం తెలంగాణలోనే అమలవుతుందన్నారు. పరిశ్రమలను ఆదుకునేందుకు, పారిశ్రామిక వేత్తలను వెన్నుతట్టి ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందన్నారు.

తెలంగాణ లాంటి రాష్ట్రాలు చేపడుతున్న పెట్టుబడుల స్నేహపూర్వక విధానాలను విదేశాల్లోని వ్యాపార వర్గాల్లో తెలంగాణ ఎన్నారైలు విస్తృత ప్రచారం కల్పించే దిశగా పని చేయాలని ఈ సందర్భంగా వారిని మంత్రి కోరారు. కేటీఆర్ గారి నాయకత్వంలో ఐటీ రంగంలో ప్రపంచంలోని టాప్ కంపెనీల క్యాంపస్ లను హైదరాబాద్ లో ఏర్పాటు అయ్యేలా చేయగలిగాడని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సింగపూర్ లోని Prad Pvt Ltd Director and Founder సునీత రెడ్డి ,శ్రావణి, పద్మ తదితరులు పాల్గొన్నారు.

మహబూబ్‌నగర్‌కు ఇండస్ట్రియల్‌ మల్టీపర్పస్‌ కారిడార్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కౌలాలంపూర్ కు ఐ.టి సంస్థలు ముందుకు వచ్చాయి. డెక్కన్ టెక్నాలజీస్, ఏఓస్ టెక్నాలజీస్, జపాన్ టెక్నోక్రాట్, టెక్ పీపుల్ ఇన్ఫోటెక్, అల్కెమిస్ట్ ట్రైనింగ్ అకాడమీ, హలీమాజమిన్, ‘కథెరిన్ చూ’ వంటి పలు కంపెనీలకు చెందిన ప్రతినిధులు త్వరలోనే మహబూబ్ నగర్ లో తమ సంస్థలను ఏర్పాటు చేసి బంగారు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములమవుతామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి హామీ ఇచ్చారు,

ఈ సందర్బంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాలమూరు ఐటీ పార్క్ కు సంబందించిన బ్రోచర్ ను ఆవిష్కరించారు అనంతరం ఆయనను Prad Pvt Ltd ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here