అమర జవాన్ ర్యాడ మహేష్ కుటుంభానికి 4,67,113 ల విరాళాలు అందించిన తెలంగాణ ప్రవాస భారతీయులు

505 0

Press note

అమర జవాన్ ర్యాడ మహేష్ కుటుంభానికి 4,67,113 ల విరాళాలు అందించిన తెలంగాణ ప్రవాస భారతీయులు

గత నవంబర్ నెలలో కాశ్మీర్ లో తీవ్రవాదుల ఎదురుకాల్పుల్లో నిజామాబాద్ జిల్లా కోమనపల్లి గ్రామానికి చెందిన ర్యాడ మహేష్ వీర మరణం చెందిన విషయం తెలిసిందే.ఈ విషయానికి చలించిన ప్రవాస భారతీయులు అమెరికా లో ఉద్యోగం చేసే కుకునూర్ గ్రామానికి చెందిన రాజశేఖర్ ర్యాడ ఆధ్వర్యంలో విరాళాలు సేకరించారు.ఈ మొత్తాన్ని కోమనపల్లి గ్రామమలోని కుటుంబ సభ్యులకు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడ అందజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా pacs ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కొత్త దయాసాగర్,ఆర్మూర్ శ్రవణ్,నరేష్ దుంపల, కొట్టాల అశోక్, యోగేష్,సంతోష్, సతీష్ కలిగొట, రాజేందర్ పుప్పాల, శ్రీనివాస్ ఆర్ముర్,గణేష్ మరియు భూమేష్ ర్యాడా పాల్గొన్నారు.
అమెరికాలో జాబ్ చేస్తున్న రాజశేఖర్ ర్యాడ తన మిత్రులు వేల్పూర్ మండలానికి చెందిన కొత్త సాగర్(కాలిఫోర్నియా) ,వేల్పూర్ మండలానికి చెందిన శ్రీరాం శ్రవణ్ (కతర్), అదిలాబాద్ కి చెందిన పన్నల జనార్దన్(జార్జియా) సహాయంతో అమెరికా కి చెందిన ప్రముఖ ఫండ్ raising పోర్టల్ వెబ్సైట్ సహాయంతో 4,67,113 రూపాయలను విరాళాలు సేకరించారు. ఈ విరళంలో 100 మంది ప్రవాస భారతీయులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ అద్యక్షుడు రవీందర్ ర్యాడ మాట్లాడుతూ 26 ఏళ్లకే దేశం కోసం అమరుడైన ర్యాడ మహేష్ కుటుంబానికి ధైర్యం చెబుతున్న మన దేశం బయట పనిచేస్తున్న ప్రవాస భారతీయులకు సలాం అని అన్నాడు.వారు అందించిన దాదాపు 5 లక్షల రూపాయలు మహేష్ కుటుంబానికి ధైర్యాన్ని మాత్రమే ఇవ్వకుండా దేశం కోసం పనిచేసే ప్రతి వ్యక్తికి వారు అండగా ఉంటామని ఈ రోజు వారు మనకు సందేశం ఇచ్చారని చెప్పారు.

Related Post

బీజేపీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పల్లె గంగారెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ కబుర్లు క్యాలెండర్ ఆవిష్కరణ

ఈ కార్యక్రమంలో బాల్కొండ అసెంబ్లీ ఇంచార్జీ రుయ్యాడి రాజేశ్వర్ , జిల్లా కార్యదర్శి నాగులపల్లి రాజేశ్వర్, bjym రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజేష్, బీజేపీ సీనియర్ నాయకులు ద్యగ…

మెట్పల్లి లో సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో ఆదర్శ మహిళా రైతులకు గౌరవ సన్మానం

మెటుపల్లిలో మహిళ దినోత్సవం పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు రవీందర్ ర్యాడ ఆదేశ అనుసారం మహిళ రైతులు చిన్నమ్మ,రాధ లకు మెటుపల్లి కౌన్సిలర్ మార్గం…

జీరో బడ్జెట్ పాలిటిక్స్ విజేతను జీరో చేయటానికి పూనుకున్న కుళ్లు రాజకీయాలు

పేద మధ్యతరగతి కుటుంబంలో పుట్టి,సాఫ్ట్వేర్ జాబ్ సాధించి, కన్న ఊరికి ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో సమాజ సేవ చేసి జీరో బడ్జెట్ తో ఎన్నికల్లో పాల్గొని(కేవలం 50…

రెంజర్ల లో అంతర్జాతీయ మహిళ దినోత్సవ సందర్భంగా సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో మహిళా రైతుకు సన్మానం

అంతర్జాతీయ మహిళ దినోత్సవాన్ని పురస్కరించుకుని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలో మహిళా రైతు రిక్కల లక్ష్మీ గారికి సేవ్…

మెక్సికోలో తొలి తెలంగాణ సంఘానికి బీజం వేసిన రాజశేఖర్ ర్యాడకు జన్మదిన శుభాకాంక్షలు

చీమలు దూరని చిట్టడివిలోకి అడుగుపెట్టి జనజీవన స్రవంతి గా మార్చటం ఎంత కష్టమో మెక్సికో లాంటి దేశంలో తెలుగు వాళ్లకు ఒక సంఘం పెట్టడం అంత కష్టం.…

Leave a comment

Your email address will not be published. Required fields are marked *