మార్కెట్ యార్డ్ రాజకీయాల్లో ప్రక్షాళన తెస్తానంటున్న ప్రవాస తెలంగాణా బిడ్డ

0
1190

ఒకపుడు రాజకీయాలు అంటే కేవలం వ్యవసాయదారులు,తర్వాతా వ్యాపారవేత్తలు, తర్వాతా తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని బాల్క సుమన్ లాంటి విద్యార్ధి నాయకుడు పార్లమెంట్లో అడుగుపెట్టాడు. ఐతే ఇపుడు ప్రవాస భారతీయులు కూడా తన జన్మ స్తలానికి సేవ చేసే అవకాశం దక్కాలని ఆత్రుత పడుతున్నారు. ఇపుడు అమెరికా లో స్తిరపడిన ఒక తెలంగాణా యువకుడు తెలంగాణా వ్యవస్థని ప్రక్షాళన చేయాలనే ఉద్దేశ్యంతో కోదాడ కి చెందినా ఒక యువకుడు తన రాజకీయ అదృష్టాన్ని పరిక్ష చేసుకుంటున్నాడు. కోదాడ మార్కెట్ యార్డ్ చైర్మైన్ పదవికి అప్లై చేసి అందరిని దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బాల్యం నుంచి తన తండ్రికి వ్యవసాయంలో సహాయం చేసిన సుదీర్
తనకు రైతుల కష్టాలు బాగా తెలుసనీ ,తనకు ఒక్క అవకాశం ఇస్తే తన ప్రాంత రైతులకు అండ దండగా ఉంటూ వ్యవసాయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశపెట్టి తన వంతు సహాయం చేస్తానని సి.ఎం కెసిఆర్ కి ఆర్జీ పెట్టాడు. నాకు అవకాశమిస్తే భవిష్యత్తులో అనేకమైన విద్యావంతులు రాజకీయాల్లోకి రావటానికి ఆసక్తి చూపుతారని లేఖలో రాసాడు.

కోదాడ మండలంలో ,వెంకట్రామపురం గ్రామానికి చెందిన జలగం సుదీర్ ,ఒక సామాన్య మధ్యతరగతి రైతు బిడ్డ. గత కొన్నేళ్లుగా అమెరికా లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న సుదీర్ ,తెలంగాణా ఉద్యమంలో అమెరికా లో అక్కడున్న యువత ని ప్రోత్సహిస్తూ ఎన్నో కార్యక్రమాలను చేపట్టాడు. ప్రదానంగా ప్రొఫెసర్ జయశంకర్ గారితో కలిసి సీమంద్ర మీడియా హఠావో అనే కార్యక్రమాన్ని నిర్వహించి అందరి ద్రుష్టి ఆకర్షించాడు. తన జిల్లాలోని ప్రతి ఒక్కరిని తెలంగాణా ఉద్యమంలో పాల్గొనేలా సోషల్ మీడియా ఉత్త్సేజపూరితమైన వ్యాసాలు రాసాడు. అమెరికాలో వెలిసిన తెలంగాణా డెవెలప్మెంట్ ఫోరం లో చాల ఆక్టివ్ గా పనిచేసాడు.

ఐతే తన అప్లికేషను ని పార్లమెంట్ శాసన సభ్యుడు వినోద్ గారు చూసి సానుకూలంగా స్పందించాడని సుదీర్ చెప్పాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here