కొండాపూర్ లో రెస్టరెంట్ ని ప్రారంభించిన మండలి చైర్మైన్ నేతి విద్యాసాగర్

0
150

శుభ్రతతో వుండి ఆరోగ్యం గా వుండే పదార్థాలు ప్రజలకు అందుబాటులో వుండే విధంగా ఏర్పాటు చేసినచో మంచి పేరు వస్తుందని తెలంగాణా శాసన మండలి చైర్మన్ నేతి విద్యా సాగర్ అన్నారు. శనివారం ఉదయం కొండ పూర్ కొత్తగూడ చౌరస్తా నూతనంగా ఏర్పాటు చేసిన డెలీషియస్ (delicious ) రెస్టారెంట్ ప్రారంభోత్సవం చేసి మాట్లాడినారు.నిరుద్యోగిలకు ఉపాది అవకాశాలు ఈ విధంగా వారు ఏర్పాటు చేసుకుంటే బావుంటుందని విద్యసాగర్ తెలిపారు.రెస్టారెంట్ అధినేత కొత్త లక్ష్మణ్ మాట్లాడుతూ చాల మంది యువత పాస్ట్ ఫుడ్ సెంటర్లు కు వెళ్ళేడం జరుగుతుంది. అక్కడ సరైన నాణ్యత లేకుండా పోతుందని తెలిపినట్టు చేపట్టడం జరిగిందని మంచి మాస్టర్ ను రుచికరంగా వండి చైనీస్, నార్త్ ఇండియన్, సౌత్ ఇండియన్ వంటల నిష్ణాతులైన వారిని ఏర్పాటు చేశామనీ తెలిపారు.ఇక్కడ బిర్యానీ ప్రత్యేకత వుంటుందని దీన్ని తక్కువ దరకు ఏర్పాటు చేయడం మా ప్రత్యేకత వుంటుందని తెలిపారు.ఈ కార్యక్రమానికి గడ్డి అన్నారం మార్కెట్ యార్డ్ చైర్మన్ సర్దార్ పుట్టం పురోషాతం రావు, మంగాళారపు లక్ష్మణ్, బండి పద్మ, ప్రముఖ
సీనియర్ జర్నలిస్ట్ మాలి కరుణాకర్, యాక్టర్ కుమారి లహరి ,ప్రియా తెలంగాణ ఐటి అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ రవీందర్ ర్యాడా, యాదగిరిగుట్ట మున్నూరు కాపు నిత్యంనదాన ట్రస్ట్ ఏనుగుల చంద్రయ్య,పలుగుల శీను వాస్ లింగమూరి తో పాటు స్థానిక సంస్థల నాయకులు పాల్గొన్నారు.


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here