ప్రముఖ కూచిపూడి కళాకారిణి ,పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ రిజిస్టార్ పుంజాల ఆలేఖ్య గారికి తెలంగాణ కబుర్లు రుద్రమదేవి 2018 అవార్డ్ రవీంద్రా భారతిలో అందచేయటం జరిగింది.ఈ ఏడాది మహిళ దినోత్సవం రోజున ఉత్తమ మహిళమణిగా తెలంగాణ కబుర్లు టీం ఆలేఖ్య గారిని ఎంపిక చేయటం జరిగింది.నిన్న మహా ప్రతివ్రత మండోదరి కథాంశంపై ఆమె ఇచ్చిన ప్రదర్శన తర్వాత ఈ అవార్డ్ ప్రదానం చేయటం జరిగింది.ఈ ప్రదర్శన ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టించింది.ప్రతి హావభావం న భూతొ న భవిష్యత్ లాగా సాగింది.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు భట్టి విక్రమార్క, ప్రముఖ కళాకారులు రాజారెడ్డి ,రాదా రెడ్డి , పుంజాల వినయ్ గారు ,రవీందర్ ర్యాడా, మంగలరపు లక్ష్మన్, సుశాంత్ బండారి, హరి,రాజేష్ షామిర్పెట్,పవన్ ఆర్మూర్ లు పాల్గొన్నారు.