అమ్మకి అక్షర నివాళి

0
1048

ఇందిరమ్మ రాజకీయాలను పెద్దోళ్ళు చెపితే విన్నాం కాని కళ్ళారా చూడలేదు. కానీ ఉక్కు మహిళ అంటే ఏంటో అమ్మని చూసిన తర్వాత తెలిసింది మగువలు తెగువ చూపితే సమాజం ఎలా మారిపోతుందో అని ….

అమ్మ చేసిన పనులను చూసిన తర్వాత తెలిసింది మన బంగారు భారతీయ మహిళలు ఉక్కు మహిళలుగా మారితే రాజ్యాన్ని ఎలా శాసిస్తారో అని ……

కరుణానిధిని కర్ర పట్టుకొని కంగు తినిపించినా…

అదే చేతితో అమ్మ క్యాంటీన్లతో తమిళ ప్రజలకు అన్నం తినిపించినా ..

ఎంజీఆర్ ని మట్టి కరిపించినా …

అదే మనసుతో తన ప్రజలకు ప్రేమ కురిపించినా ..

చెన్నారెడ్డి ని చెడుగుడు ఆడినా …. పివి కి ఎదురు తిరిగినా…. వాజపేయి తో వాదించినా….

రైట్ రాజకీయాల్లో తన లెఫ్ట్ సిద్ధాంతాలతో ముందుకెళ్లినా ఆమె తీరు ప్రశంసం,ప్రత్యేకం,ఏకైకం…..

జయలలిత చూపిన తెగువ మగువలకే కాదు పురుషులకు కూడా స్ఫూర్తిదాయకం.

చరిత్రలో రుద్రమ, లక్ష్మి భాయి, ఇందిర, జయమ్మ …రేపు ఎవరో …?

 

తుమ్మితే ఊడిపోయే జీవితానికి కమ్మని సెలవు చావు

ఉమ్మితే తుడుచుకునే బతుకుకి చక్కని గమ్యం చావు

రమ్మువిస్కీ వాసనలతో నిండిపోయిన దీర్గ కాల మత్తుకి చక్కని golden drop చావు

రమ్మి తీన్ పత్తలతో నిండిన గేమ్ కి సరైన ఫినిషింగ్ కార్డు చావు

దమ్ముతో దర్జాగా బతికే వాడికి సరైన స్వర్గం చావు

విలువైన జీవితాన్ని మధ్యలో ఆపకు,చావు వచ్చినపుడే చావు

భారతీయ మహిళలకు దైర్యం నింపి వెళ్లిపోయిన ఈ తరం ఇందిరమ్మకి ఇవే మా కన్నీటి అక్షర నివాళి….

Author Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here