కొండా దంపతులు జనసేన లోకి రావాలంటున్న తెలంగాణ సైనికులు

1
4015

నిన్న కొండా దంపతులు పెట్టిన ప్రెస్ మీట్ చాలా పార్టీలకు కొత్త ఆశలను సృష్టించింది. కొండా సురేఖ గారు తన ప్రెస్ మీట్ లో తన పైన జరిగిన అన్యాయాన్ని,తెరాస పైన అసమ్మతిని ,వరంగల్ జిల్లాలో తమ బలాన్ని ,కేటీఆర్ హరీష్ రావు ల మధ్య ఉన్న నాయకత్వపు తేడాలను ,అవసరమైతే ఇండిపెండెంట్ గా 3 సీట్లలో పోటీ చేస్తామని చెప్పటం,ఎమ్మెల్సీ ఉన్న పట్నం నరేందర్ గారికి టిక్కెట్ దక్కిందని ,ఎంపీగా ఉన్న బాల్క సుమన్ కి టికెట్ దక్కిందని అలాంటిది ఎంతో ప్రజాదరణ ఉన్న కొండా కుటుంబానికి ఎక్కువ టిక్కెట్లు ఎందుకు రాకూడదని ప్రశ్నించారు. టీడీపీ లో ఉన్న దయాకర్ రావు తెరాస లో రేచ్చిపోవటానికి అయన కులమే కారణమని ,ఈ రోజు రాష్ట్ర రాజకీయాలు కుల సంఘాల వల్లే నడుస్తున్నాయని అని చెప్పటంతో అందరూ ఒక్కసారి ఆశ్యర్యంలో మునిగిపోయారు. ఎందుకంటే తెరాసలో ఎంతో మంది సీనియర్లు తెరాస లో ఉన్నా కూడా ఇప్పటివరకు కెసిఆర్ గారి మీద అసమ్మతి ప్రకటించిన వాళ్ల్లు ఎవరు లేరు. కాని ఒక మహిళ గా ఉండి ఎవరు చేయని పని ఆమె చేయటంతో ఒక్కసారి టాక్ అఫ్ ది ది తెలంగాణ గా మారిపోయారు సురేఖ గారు.

అయితే ఇదిలా ఉండగా కొండా సురేఖ లాంటి నాయకురాలు ఒక పార్టీకి బాధ్యతలు అప్పగిస్తే గౌరవప్రదమైన సీట్లు దక్కే అవకాశం ఉంటుందని వాళ్ళ ఆలోచన. ప్రధానంగా జనసేన పార్టీ అభిమానులు ,నాయకులు ఈ అంశంపైనా తమ తమ సోషల్ మీడియా సీక్రెట్ గ్రూప్ ల్లో ,కొందరు బాహాటంగా సురేఖ గారు తెలంగాణ పార్టీ బాధ్యతలు తీసుకుంటే తెలంగాణ లోని అన్ని స్థానాల్లో పోటీ చేయొచ్చని వాళ్ళు ఆశిస్తున్నారు. ఎందుకంటె కొండా సురేఖ గారు ఒక మహిళ కావటం ,తెలంగాణ లో 30% పైగా 2 బలమైన సామాజిక వర్గాలు వాళ్ళింట్లో ఉండటం ,పాత వరంగల్ జిల్లాలో లో కొండా దంపతుల ప్రాభల్యం ఉండటం ,కెసిఆర్ ని ఎదుర్కునే సత్తా వాళ్ళకుండటం. వీటితో పాటు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు తెలంగాణాలో భారీగా ఉండటం ఒక బలమైన ప్లస్ పాయింట్. తెలంగాణలో ఆంధ్రలో వేర్వేరుగ ఎన్నికలు ఉండటంతో పవన్ కి ప్రచారం చేసే వెసులుబాటు ఉంటుంది.
ఇందులో కొసమెరుపు ఏంటంటే కేటీఆర్ గారి మంత్రివర్గ కోటరీలో తనను ఉంచుకోవటం ఇష్టం లేకే తనకు సీట్ ఇవ్వలేదని సురేఖ చెప్పటం.

 

విశ్లేషణ :అశ్విన్

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here