పూరీలో ఎంపీ కవితకు అదిరిపోయే పుట్టినరోజు గిఫ్ట్

0
845

నిజామాబాద్ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత జన్మదినం (మార్చ్ 13) సందర్భంగా ఒరిస్సాలోని పూరీలో సైకత శిల్పం వెలసింది. శ్రీమతి కవితకు శుభాకాంక్షలు తెలుపుతూ రూపుదిద్దుకున్న ఈ ఇసుక ఆకృతిలో “హ్యాపీ బర్త్ డే కవితా జీ” అని రాసారు. తెలంగాణ జాగృతి పేరుతో వెలసిన ఈ సైకత శిల్పాన్ని తెలంగాణ జాగృతి వరంగల్ అర్బన్ అధ్యక్షులు కొరబోయిన విజయ్ నిర్మింపజేశారు. ప్రఖ్యాత సైకతశిల్పి జితెందర్ సాహు చేతుల్లో ఆదివారం ఉదయం రూపుదిద్దుకున్న ఈ కళాఖండం తయారీలో మరో 6 గురు సహాయకులు పాల్ఘొన్నారు. పూరీలోని మాడల్ బీచ్‌లో ఈ సైకతశిల్పం వద్ద ఫోటోలు దిగేందుకు పర్యాటకులు పోటీపడ్డారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here