‘ఫిదా’ చిత్రం తనను ఫిదా చేసిందని మంత్రి కేటీఆర్‌…

0
273
Telangana IT Minister Ktr said that the film 'Fida' was fired.
Telangana IT Minister Ktr said that the film 'Fida' was fired.
    వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి జంటగా నటించిన, శేఖర్‌ కమ్ముల దర్శకత్వంలో కొత్తగా వచ్చిన‘ఫిదా’ చిత్రం తనను ఫిదా చేసిందని తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. జులై 21న విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇటీవల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ చిత్రాన్ని చూసి యూనిట్‌ సభ్యులను అభినందించారు. ఈ సినిమాను చూసిన కేటీఆర్‌ కూడా తాజాగా ట్విటర్‌లో తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.
    ‘తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హృదయాన్ని కదిలించే ప్రేమకథ నిజంగా నన్ను ‘ఫిదా’ చేసింది! అభినందనలు.. శేఖర్‌ కమ్ముల, వరుణ్‌తేజ్‌, సాయిపల్లవి’ అని కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here