టీటా ఖాతాలో మరో అరుదైన పురస్కారం.

0
523
Telangana formation Day Award to TITA
Telangana formation Day Award to TITA
    భారతదేశం లో నూతనంగా ఏర్పడిన రాష్ట్రం మన తెలంగాణ రాష్ట్రం . రాష్ట్ర అవతరణ మొదలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ప్రజా శ్రేయస్సులో ముందుకు దూసుకుపోతుంది. ప్రజాప్రతినిథులు, ప్రభుత్వ ఉద్యోగులు రాష్ట్ర అభివృద్ధికై పాటు పడుతున్నారు. ప్రజలలో చైతన్యం పెరిగిపోయింది. సేవా కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు కూడ భాగస్వాములవుతున్నారు.
    తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల శ్రేయస్సుకై , రాష్ట్ర అభివృద్ధికై కొత్త కొత్త ఆవిష్కరణలు చేపడుతూ ప్రజల మన్ననలను పొందుతుంది.తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఐటీ పరిశ్రమల స్థాపనకై అహర్నిశలు కృషి చేస్తుంది. నిరుద్యోగ సమస్యలను రూపుమాపడానికి, ఉద్యోగుల శ్రేయస్సు కొరకై అనేక కార్యక్రమాలని చేపడుతుంది. అందులో భాగంగా ఐటీ రంగంలో అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్న టీటాకి గౌరవ పురస్కారాన్ని ప్రధానం చేసింది. డిజిటల్ ఇండియాలో భాగంగా టీటా నిర్వహించిన అద్భుతమైన కార్యక్రమాలకి ఈ అవార్డును ప్రధానం చేసారు.

    తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రిత్వ శాఖ ఆద్వర్యంలో జూన్ 1 వ తేదిన తాజ్ దక్కన్ లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమం లో ఐటీ మంత్రి శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారి చేతుల మీదుగా టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తలా , వైస్ ప్రెసిడెంట్ రానాప్రతాప్ బొజ్జం లకు అవార్డును ప్రధానం చేసి అభినందించారు. టీటా చేస్తున్న కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. ఈ కార్యక్రమం లో మంత్రి కేటీఆర్ , పెద్దపల్లి ఎంపి బాల్క సుమన్ , టీ న్యూస్ ఎండి సంతోష్ గారు మరియు టీటా ప్రతినిథులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here