తెలంగాణ లో బీసీలు జనసేనని తమ పార్టీగా మలుచుకుంటున్నారా?

0
2258
కులాల విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలలో విభిన్న పరిస్థితులు ఉంటాయి.సామజిక వర్గాల పరంగా చూసినప్పుడు తెలంగాణ సమాజం,ఆంధ్ర సమాజానికి బిన్నంగా ఉంటుంది.తెలంగాణాలో స్వాతంత్య్రానికి పూర్వం నిజాం పరిపాలన వలన రెండు సామాజిక వర్గాల ఆధిపత్యం కనిపిస్తుంది.ఇక రాజకీయంగా చూసుకుంటే ఆ రెండు సామజిక వర్గాలే తెలంగాణని పరిపాలిస్తున్నాయి. SC,ST లకి  రిజెర్వేడ్ స్థానాలు వున్నాయి.కానీ బీసీల విషయంలో జనరల్ స్థానాలలోనే వారి పోటీ చేయాలి.కానీ తెలంగాణలో అన్ని పార్టీలు   జనరల్ స్థానాలలో ఆ రెండు సామజిక  వర్గాల అభ్యర్థులకే అవకాశాలు ఇస్తున్నాయి.
ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు తెలంగాణాలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు.ఆ రోజు వున్న సామజిక వర్గ సమీకరణాలు సామజిక పరిస్థితులని బట్టి బీసీలలో అసంతృప్తిని గ్రహించి తెలంగాణాలో బీసీలకు ఎక్కువ అవకాశాలు కల్పించారు.అదే విధంగా బీసీలు కూడా తెలుగుదేశం పార్టీని తమ పార్టీగా మలుచుకున్నారు.కానీ విభజనాంతర పరిణామాల తరువాత తెలుగుదేశం పార్టీ తెలంగాణలో కనుమరుగైపోవడం వలన పరిస్థితులు మళ్ళీమొదటికి వచ్చాయి.ఎంతలా అంటే మొత్తం మంత్రిమండలిని  70 % రెండు సామజిక వర్గాలతో నింపేశారు.వున్న ఇద్దరు,ముగ్గురు బీసీ ,మంత్రులకి కూడా ప్రాధాన్యత లేని శాఖలను ఇచ్చి,వారి అభిప్రాయాలకు ఎటువంటి విలువ ఇవ్వటం లేదు.అటు కాంగ్రెస్ పార్టీ  కానీ,ఇటు  తెరాస పార్టీ కానీ బీసీలకు సముచిత ప్రాధాన్యత ఇవ్వటం లేదు.రెండు సామజిక వర్గాలతో ఆ రెండు పార్టీలు నిండిపోయాయి.
ఈ పరిస్థితులను బీసీలు ప్రత్యక్షముగా గమనిస్తున్నారు.కానీ వారికి ఏ పార్టీ కూడా వారికీ అనుకూల పరిస్థితులు కల్పించుటలేదు.
ఇటువంటి పరిస్థితులలో ఎంతో మంది బీసీ మరియు దళిత యువకులు జనసేన మద్దత్గుగా పనిచేస్తున్నారు.జనసేన పార్టీ కూడా బీసీలకి మంచి  ప్రాధాన్యత ఇచ్చి ప్రోత్సహిస్తుందిఇప్పటికే బీసీ వర్గానికి చెందిన నేమూరి శంకర్ గౌడ్ ని తెలంగాణ ఇంచార్జిగా  జనసేన పార్టీ నియమించింది.జిల్లాల స్థాయిలో కూడా బీసీలు జనసేన పార్టీ  కోసం  ఎంతగానో కృషి చేస్తున్నారు.
ఈ పరిణామాలను మనం గమనించినప్పుడు తెలంగాణాలో జనసేన పార్టీ బీసీల వేదికగా మారబోతుంది అనే సంకేతాలు కనిపిస్తున్నాయ్.
రామకృష్ణ మిరియాల (RK)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here