భారత్ లో ఎఫ్‌-16 యుద్ధ విమానాల తయారీకి లైన్‌ క్లియర్‌

0
489
Tata to make F-16 aircrafts in india
Tata to make F-16 aircrafts in india

ఎఫ్‌–16 యుద్ధ విమానాలను భారత్‌లో తయారు చేసేందుకు టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌(TASL), అమెరికన్‌ ఏరోస్పేస్‌ దిగ్గజం లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఒప్పందం తీసుకున్నాయి. ఈ ఒప్పందంతో అమెరికా టెక్సాల్‌లోని లాక్‌హీడ్‌ సంస్థ ప్లాంట్‌ను భారత్‌కు తరలించనున్నారు. భారత వాయు సేనకు అవసరమయ్యే యుద్ధ విమానాల లోటును తీర్చే బిలియన్‌ డాలర్ల ఆర్డర్‌ను ఆ సంస్థ పొందనుంది. ఈ నెల 26న భారత ప్రధాని మోడి, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌తో కలుసుకోనున్నారు. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ అమెరికా సాఫ్ట్ వేర్ కంపెనీలపై ఒత్తిడి చేస్తున్నారు ఇలాంటి సమయంలో లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ భారత్‌లో ఎఫ్‌-16 యుద్ధ విమానాల తయారీకి ఒప్పందం తీసుకోవటం విశేషం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here