తారక్ సినిమాలకు సినిమా కష్టాలు

0
678

నందమూరి తారక రామారావు పోలికలతో పుట్టి అయన ఇమేజ్కి ఈ తరంలో వారసుడిగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఏంటో ఇమేజ్ సాధించాడు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన పేరే గాని ఒక సామాన్య వ్యక్తికి వచ్చే సినిమా కష్టాలు అయన ఎదుర్కున్నాడు. మొదట్లో కుటుంబం నుంచి మద్దతు లేకపోవటం ,తర్వాత బాబు బంధువుల అమ్మాయిని తారక్ పెళ్లి చేసుకోవటంతో అయన సినిమాలకు పూర్తి మద్దతు లభించింది. తర్వాత లోకేష్ కి పోటీ వస్తున్నాడని తెలుసుకున్న టీడీపీ వర్గాలు తారక్ సినిమాను దూరం పెట్టాయి. దాని వలన టెంపర్, నాన్నకు ప్రేమతో సినిమాలు కంటెంట్ పరంగా అత్యద్భుతంగా ఉన్నా కూడా ఆ లెవల్లో బాక్స్ ఆఫీస్ ని ప్రభావితం చేయలేకపోయాయి.

ఐతే ఎన్నో అంచనాల మధ్య విడుదల అవుతున్న జనతా గారేజ్ సినిమాకు కూడా కష్టాలు మొదలు అయ్యాయి. ఐతే మాములుగా ఎదో ఒక కష్టాన్ని చవిచూసే తారక్ సినిమా ఈ సారి మాత్రం మూడు కష్టాలు ఎదుర్కొంటున్నాడు. అవేంటో చూద్దాం పదండి.

1) ఇటీవల కర్ణాటకలో ఎన్టీఆర్ అభిమాని చేతిలో పవన్ కళ్యాణ్ అభిమాని,జనసేన కార్యకర్త వినోద్ రాయల్ దారుణ హత్య కావటంతో పవన్ అభిమానులు ఈ విషయాన్నీ చాలా సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తున్నారు. ఇప్పటికే జనతా గ్యారేజ్ సినిమాను పవన్ కళ్యాణ్ అభిమానులు బహిష్కరించాలని సోషల్ మీడియా లో వైరల్ గా వెళ్ళిపోయింది.
2) సినిమాకి సంబందించిన బెనిఫిట్ షోలను ఆంధ్రాలో పర్మిషన్ ఇవ్వటం లేదని తారక్ అభిమానులు  తెదేపా నాయకులపైన గుర్రుగా ఉన్నారు.
3) ఇది ఇలా ఉంటే ,రెండు రాష్ట్రాల్లో భారీ వర్షపాతాలు నమోదయ్యాయి. హైదరాబాద్ లోనైతే అత్యధిక వర్షపాతం నమోదైంది.ఈ ఘటనలో ఇప్పటికే 8 మంది మృతి చెందారు. ఈ పరిణామంతో నగరంలో ప్రజలు బయటకు వెళ్లే సూచనలు కనిపించటంలేదు.

కష్టాలన్నీ తట్టుకొని తారక్ కి తన పూర్వ వైభవం రావాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here