4 గంటల్లోనే ముగిసిన సిట్ విచారణ…

0
402
taneesh sit enquiry finished in four hours
taneesh sit enquiry finished in four hours

డ్రగ్స్‌ కేసులో హీరో తనీష్‌ ఉదయం 10.30గంటలకు ప్రారంభమైన సిట్‌ విచారణ నాలుగు గంటలు కొనసాగింది. మాదకద్రవ్యాల కేసులో సిట్‌ అడిగిన ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పాడు తనీష్‌. డ్రగ్స్ కేసులో తన పేరు రావడంపై కుటుంబ సభ్యులు బాధపడ్డారన్న తనీష్ విచారణ విషయంలో మీడియా సంయమనం పాటించాలన్నారు. ఊహాగానాలు కాకుండా జరిగిన విషయాన్ని ప్రజలకు చేరవేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు తనీష్. డ్రగ్స్‌ వ్యవహారంలో ఇప్పటివరకు దర్శకుడు పూరి జగన్నాథ్‌, కెమెరామెన్‌ శ్యామ్‌ కే నాయుడు, ఆర్ట్‌ డైరెక్టర్‌ చిన్నా, నటుడు సుబ్బరాజు, హీరోయిన్‌ చార్మి, ముమైత్‌ ఖాన్‌, హీరో రవితేజ, నవదీప్‌ తరుణ్‌లను సిట్ అధికారులు ప్రశ్నించారు. మంగళవారం ( ఆగస్టు 1) యువ నటుడు నందు విచారణకు హాజరు కానున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here