రైతన్న నగ్నపోరాటం – మోడీ సెల్ఫీ ఆరాటం

  0
  579
  Tamil-farmers-shocking-darna-
  Tamil-farmers-shocking-darna-
   అభివృద్ది చెందుతున్న భారతదేశం. ఈ మాట మన ముందు తరాలు చెప్పాయి. ఇప్పుడు చెపుతున్నారు. ఇంకా తరతరాలు చెప్పుకుంటారు కావొచ్చు.
   భారతదేశంలో తిండి పెట్టె రైతన్న కష్టాలకి ఆపన్న హస్తాలు ఉండవు కాని నలుగురిని మోసం చేసే వాళ్ళకి వంగి వంగి దండాలు పెట్టే మన రాజకీయ నాయకులు ఉన్నంత వరకి మన దేశం అభివృద్ది చెందుతున్న దేశం గానే ఉంటుంది.
   వేల కోట్లు మోసం చేసిన వా ళ్ళ కి ఋణ మాఫీ , తిండి కోసం – గుడ్డ కోసం కష్టపడుతూ వచ్చిన నాలుగు రూపాయిలు బ్యాంకులో కట్టే రైతన్నకి లాఠీలతో సన్మానాలు చేసే ప్రభుత్వాలు ఉన్న దేశం ఎలా అభివృద్ది చెందుతుంది. కష్టాల్లో ఉన్న రైతన్న గోడు వినలేని ప్రభుత్వాలు మనవి.
   తమిళనాడు కు చెందిన రైతులు గత 28 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర దీక్ష చేస్తున్నారు. వీరికి సహయం చేయడానికి మన రాజకీయ నాయకులకి చేతులు రావడం లేదు. అయితే వాళ్ళకి ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోవడం తో ఈ రోజు పార్లమెంట్ దగ్గర ఏర్పాటు చేసిన బారికేడ్లను దాటుకుని పార్లమెంట్ సౌత్ బ్లాక్ ఎదుట నగ్నంగా నిరసన చేసారు.
   నగ్నంగా రోడ్ల మీద పొర్లు దండాలు పెట్టారు. జై కిసాన్.. కిసాన్ బచావో అంటూ నినాదాలు చేశారు. ఎర్రటి ఎండలో రోడ్డుపై నగ్న ప్రదక్షిణలు చేశారు రైతులు.
   ప్రధాని నరేంద్ర మోడీని కలిసి తమ గోడును చెప్పుకుందామంటే అప్పాయింట్ మెంట్ ఇవ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
   కానీ మన ప్రియతమ నాయకుడు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆస్ట్రేలియా ప్రధానితో కలిసి ఢిల్లీ మెట్రో రైల్లో చక్కర్లు కొడుతూ సెల్ఫీలు దిగారు.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here