టీ-వాలెట్ ను లాంచ్ చేసిన కేటీఆర్

0
334
KTR launched T Wallet
KTR launched T Wallet
  తెలంగాణ రాష్ట్ర ఐటీ మంత్రిగా పదవి ప్రమాణం చేసిన మొదలు కొత్త కొత్త ఆవిష్కరణలకి శ్రీకారం చుడుతున్నారు మంత్రి కేటీఆర్ గారు. ఐటీ పరిశ్రమని అభివృద్ధి బాటలో నిలబెడుతూ అహర్నిశలు శ్రమిస్తున్నారు. టీ హబ్ రూపకల్పనలో తన కృషి అత్యద్భుతం.
  ఈ క్రమంలోనే ప్రభుత్వ అధికారిక డిజిటల్ వాలెట్.. టీ-వాలెట్ ను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గారు విడుదల చేశారు.
  డిజిటల్ ఇండియాలో భాగంగా దేశం మొత్తం ఆన్ లైన్ సేవలని ప్రోత్సహిస్తుండటంతో ప్రభుత్వ కార్యకలాపాలకి ప్రభుత్వ అధికారిక డిజిటల్ వాలెట్ ను రూపొందించారు. ఆన్ లైన్ , స్మార్ట్ ఫోన్, ఫ్యూచర్ ఫోన్ లను ఉపయోగించి టీ వాలెట్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు. టీ వాలెట్ చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల చెల్లింపులన్నీ ఎప్పుడైనా, ఎక్కడి నుంచి అయినా టీ వాలెట్ ద్వారా చెల్లించవచ్చని తెలిపారు అధికారులు.
  ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ 2016-17లో 13.85 శాతం వృద్ధితో రూ.85వేల 470 కోట్లకు చేరుకున్నాయని, ఐటీ-ఐటీఇఎస్ రంగ ఎగుమతులు. ఐటీ రంగంలో కేంద్ర వృద్ధి 10 శాతం ఉంటే తెలంగాణ 13.85 శాతం వృద్ధి కనబరిచిందనితెలిపారు.. గతేడాది కొత్తగా 24 వేల 506 మంది ఈ రంగంలో చేరారు. దీంతో రాష్ట్రంలో ఐటీ రంగంలో పనిచేసే వారి సంఖ్య 4లక్ష 31వేల 891 కి చేరిందని చెప్పారు.
  T వ్యాలెట్ వివరాలు
  *ఆధార్ ప్లస్ బయో మెట్రిక్, ఆధార్ ప్లస్ మొబైల్ OTP ద్వారా టీ-వాలెట్ యాప్ ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

  *తెలుగు, ఉర్దూ, ఇంగ్లీష్ మూడు భాషలలో యాప్ రూపొందింది.

  *ఆసరా, ఉపాధి హామీ పథకాల ద్వారా వచ్చే నగదును కూడ ఈ యాప్ ద్వారా పొందొచ్చు.

  *స్మార్ట్ ఫోన్, ఇంటర్నెట్ లేకుండానే ఈ యాప్ ఉపయోగించుకోవచ్చు.

  *మీ సేవ ద్వారా మీ వ్యాలెట్ లో డబ్బు వేసుకోవచ్చు.

  >>ఈ యాప్ ద్వారా జరిపే లావాదేవీలకు ఎలాంటి ఛార్జీలు ఉండవని, దీనిని ఉచితంగా ఉపయోగించవచ్చు అని అధికారులు వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here