జడ్జీకి జైలు శిక్ష :సుప్రీంకోర్ట్ సంచలన నిర్ణయం

0
317
supreme court sensational decision
supreme court sensational decision
    దేశంలోనే మొట్ట మొదటి సారిగా ఒక జడ్జీకి 6 నెలల జైలు శిక్ష విధించింది మన అత్యున్నత న్యాయ స్థానం.
    న్యాయ శాస్త్ర చరిత్రలో ఇదో సంచనాన్ని రేకేత్తించిన రోజు. కోర్టు ధిక్కారణకు పాల్పడ్డారని కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ క‌ర్ణ‌న్ కు శిక్ష విధించింది సుప్రీంకోర్టు. కోల్‌క‌తా పోలీసుల‌కు క‌ర్ణ‌న్‌ను వెంట‌నే అరెస్టు చేయాల‌ని ఆదేశాలు జారీ చేసింది. అలాగే మీడియాపై ఆంక్ష‌లు విధించింది సుప్రీంకోర్టు.

కోల్‌క‌తా హైకోర్టు జ‌డ్జి జ‌స్టిస్ క‌ర్ణ‌న్ ఎస్సీ, ఎస్టీ,అత్యాచార నిరోధ‌క చ‌ట్టం కింద సుప్రీం కోర్టు చీఫ్ జ‌స్టిస్ జేఎస్ కేహార్‌తో స‌హా ఏడుగురు జ‌డ్జీల‌కు ఐదేళ్లు క‌ఠిన‌కారాగార శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించాడు. అలాగే జస్టిస్ కర్ణన్ దేశవ్యాప్తంగా 20 మంది జడ్జిలు అవినీతికి పాల్పడ్డారని వారిపై విచారణ జరిపించాలని పేర్కొంటూ ప్రధానమంత్రి నరేంద్రమోడీకి లేఖ రాశారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన అత్యున్న‌త న్యాయ‌స్థానం జ‌స్టిస్ క‌ర్ణ‌న్ కు శిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here