మహిళల సత్తా చాటిన సూపర్ విమెన్ ఇండియా అవార్డుల ప్రదానోత్సవం

0
398

ప్రపంచంలో మహిళకున్న సత్తా ,సమర్థత ,సామర్థ్యం మనకు తెలియనివి కావు. పురాణాల్లో సత్యభామ నుంచి నేటి సింధు ,పూర్ణల వరకు సమయమొచ్చినపుడు మహిళశక్తి బయటకి వచ్చి పురుషులకు దీటుగా రాణిస్తున్నారు. ఒక మహిళకు తలుచుకుంటే ఏదైనా సాధించొచ్చు.
ఒక మహిళ ఒకరోజు పని చేయటం మానేస్తే భారతదేశం లాంటి దేశంలో ఎంతో నష్టాలు వస్తుంటాయి. అయినా కూడా ఈ సమాజంలో మహిళలు చేసే కృషికి ప్రోత్సాహం అనేది కొంచెం తక్కువే అని చెప్పాలి. కాని మహిళల కృషికి ప్రోత్సాహం అందించటానికి మేమున్నాం అని ముందుకొచ్చారు ఇన్నోవేక్సియా ఇంటర్ నేషనల్ సంస్థ వారు. శనివారం కూకట్పల్లి జేఎన్టీయూ ఆడిటోరియం లో సూపర్ ఇండియా విమెన్ పేరుతొ వివిధ రంగాల్లో కృషి చేస్తున్న 18 మహిళలకు అవార్డులు ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇన్నోవేక్సియా సీఈఓ డాక్టర్ గీతాంజలి గారి ఆధ్వర్యంలో చక్కగా నిర్వహించబడింది.

ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ,రంగారెడ్డి జడ్పీ చైర్మైన్ పట్నం సునీత రెడ్డి ,మాజీ మంత్రి సునీతా లక్ష్మణ్ రెడ్డి ,సినీ నటీమణులు జీవిత రాజశేఖర్ ,మంచు లక్ష్మి ,అనూస్ బ్యూటీ అధినేత అన్నపూర్ణమ్మ లతో పాటు వివిధ మహిళలు విచ్చేశారు.
నేషనల్ హ్యాండ్లూమ్ బ్రాండ్ అంబాసిడర్ రష్మిక టాగూర్ ,జిమ్నాస్టిక్ క్రీడాకారిణి మేఘన రెడ్డి ,భరతనాట్య కళాకారిణి సునయన ,సరయు లతో పాటు మరికొందరు అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో లిమ్కా బుక్ రికార్డు హోల్డర్ హర్షా జైన్ మహిళల బాధ్యతల పైన ,వాళ్ళ దైర్యం పైన వేసిన పెయింటింగ్ అందరిని ఆకర్షించింది.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here