సందీప్ కిషన్ ప్రస్థానంలో ఫ్లాఫ్ నీడలు వీడినట్లేనా?

0
3869

2010 లో ప్రస్థానం సినిమా విడుదల అయినపుడు అన్ని అందరూ ఆ కథ ,కథాంశం ,సాయి కుమార్ డైలాగ్స్ గురుంచి మాట్లాడుతుంటే మరో వైపు నెగటివ్ షేడ్స్ ఉన్న ఒక పాత్ర గురుంచి చర్చించుకున్నారు. ఏంటి చిరంజీవి గారు కెరీర్ తొలినాళ్లలో చేసిన విలన్ పాత్రలు గుర్తుకుతెస్తున్నాయి అని ప్రేక్షకుల ఫోకస్ ఆ కొత్త కుర్రాడి వైపు మరలి ఆ రోజుల్లో సంచలనంగా మారినాయి. అయన ఎవరో కాదు సందీప్ కిషన్. ఆ సినిమా తర్వాత గుండెల్లో గోదావరి ,వేంకటా ద్రి ఎక్స్ ప్రెస్ లాంటి సినిమాల్లో హీరోగా తనకున్న విభిన్నమైన ఈజ్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు. కాని ఆ సినిమాల తర్వాత కథలు సరైనవి పడకపోవడంతో దాదాపు 6 ఏళ్ళు ఫ్లాఫులతో సతమతమయ్యాడు. రొటీన్ సినిమాల కన్నా ప్రయోగాలు,విభిన్న కథాంశాలతో కూడిన సినిమాలు తీసినా కూడా ప్రేక్షకులకు నచ్చకపోవటంతో ఫ్లాఫుల పరంపర కొనసాగింది.

అయితే తాను నమ్మిన విభిన్న కథాంశాల ఎంపిక మాత్రం సందీప్ ఆపలేదు. కాని ఇటీవల విడుదల అయిన నిను వీడని నీడను నేను అనే సినిమా మాత్రం అయన చేసే ప్రయోగానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుంది. ఇప్పటి వరకు అయన నటనతో ఎప్పుడు ఫెయిల్ కాని సందీప్ కి ఇప్పుడు తానూ ఎంచుకున్న కథ కూడా ఫెయిల్ కాలేదని నిరూపించబడింది. ఏమైనా ఈ సినిమాతో సందీప్ కిషన్ ప్రస్థానంలో ఫ్లాఫ్ నీడలు వీడాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here