సుదీర్ బాబు చింపేసాడు అంతే !!

0
579

సుధీర్‌బాబు….అప్పుడెప్పుడో మహేష్ బాబు బావగా తెరకు పరిచయమై ఇప్పటికీ మహేష్‌బాబు బావగానే మిగిలిపోయాడు. మధ్యలో ప్రేమకథాచిత్రం లాంటి బ్లాక్ బస్టర్ హిట్ పడినా మనవాడికి వచ్చిన క్రెడిట్ ఏమీ లేదు. తెలుగు ఇండస్ట్రీలో కెరీర్ విషయంలో కిందా మీదా పడుతున్న సుధీర్ ఇప్పుడు హిందీ బాఘీలో విలన్‌గా చేస్తున్నాడు. ఫస్ట్‌లో చాలా మంది ఈ ఆఫర్ కూడా మహేష్ రెఫరెన్స్‌తో వచ్చి ఉంటుంది అనుకున్నారు కానీ…ఇప్పుడు ఆ సినిమా టీజర్ చూస్తుంటే సుధీర్‌ హార్డ్ వర్క్, డెడికేషన్‌తో పాటు టాలెంట్ కూడా కనిపిస్తోంది. చూసిన వాళ్ళందరూ ప్రశంశలతో ముంచెత్తుతున్నారు. సినిమాల్లో హీరోగా చేసినప్పుడు కూడా….రెండు గంటల సినిమాలు చూశాక కూడా రాని అప్లాజ్ సింగిల్ టీజర్‌తో కొట్టేశాడు సుధీర్. మామూలుగానే హార్డ్‌వర్క్‌ని ఇష్టపడే సుధీర్‌కి ఇప్పుడు సక్సెస్ కూడా వచ్చేట్లుగా కనిపిస్తోంది. ఈ వీడియో పైన మీరూ ఓ లుక్కేయండి. మీరు నా ఒపీనియన్‌ని ఒప్పుకుంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here