తెలంగాణ సంస్కృతిని మరో మెట్టు ఎక్కించటంలో ఈ సినిమా మరో తోపు అవుతుందా?

0
184

ఒకప్పడు స్వాతి ముత్యం ,మహానగరంలో మాయగాడు లాంటి సినిమాలు చూస్తే వాటిలో హరి కథ ని కొన్ని పాటల్లో కథకు అనుగుణంగా సాహిత్యం మార్చి ప్రేక్షకులకు హరికథ ను దగ్గర చేశాయి అని చెప్పొచ్చు. కొన్ని సినిమాల్లో బుర్ర కథ కూడా కొన్ని సందర్బోచిత పాటల్లో డిఫరెంట్ సాహిత్యంతో సినిమాను జనరంజకంగా మార్చాయి. కాని హరికథ,బుర్ర కథలకు దీటుగా తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో వినిపించే కళ ఒగ్గు కథ. దురదృష్టవశాత్తు దర్శక నిర్మాతలు హీరోలు సంగీత దర్శకులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు కావడమో లేక ఆ సినిమాలు ఆంధ్ర నేపత్యంలో ఉండటమే కాని ఆ సినిమాల్లో ఒగ్గు కథకు స్థానం లేకుండా పోయింది.

ఒకప్పుడు తెలంగాణ యాసను నెగటివ్ కోణంలో చూయించిన టాలీవుడ్,రాష్ట్రం ఏర్పడ్డాక పరిశ్రమ పంథా మారిపోయిందనే చెప్పొచ్చు. పెళ్లి చూపులు ,ఫిదా సినిమాల్లో హీరో హీరోహిన్ లతో తెలంగాణ యాసలో మాట్లాడించి తెలంగాణ యాసకు గొరవం తెచ్చారు. ఇపుడు నువ్వు తోపు రా సినిమాతో తెలంగాణ సంస్కృతి ని టాలీవుడ్ లో మరొక మెట్టు ఎక్కించారు. సరూర్ నగర్ నేపథ్యంలో వస్తున్నా ఈ సినిమా లో ఒగ్గు కథతో ఒక పాటను కథకు అనుగుణంగా రూపొందించి క్యాచీ సాహిత్యంతో హీరో ,లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కొమాకుల తో పాడించటం కొత్త ప్రయోగానికి తెరదించినట్లు అయింది. కింద పేరుగొన్న మాటలు కూడా కొత్తగా ఉన్నాయి.

  • ఇక్కడ గల్లీ గల్లీకి వైన్ షాప్ ఉంటది ,మన ఇజ్జత్ మనకుంటది
  • ఇడ బాదపడనికి బడ్జెట్ కావాలి
  • తొక్కల బ్యాక్ లాగుల కోసం మస్తు అటెంప్ట్ లను చేస్తం ,బ్యాక్ బోన్ లాంటి పోరి కోసం చేయమా …
  • బెసికళ్ళి తెలుగోళ్లకు రెండు సార్లు యూనిటీ వస్తది పండగలు వచ్చినపుడు లేదా పవన్ కళ్యాణ్ సినిమా వచ్చినపుడు
  • నాకు వైట్ కాలర్ జాబ్ రాకపోవచ్చు కాని కాలర్ ఎగరవేయటం సరూర్ నగర్ నుంచి వచ్చు
  • టైమును మానేజ్ చేసుకుంటే డెస్టినీ ని మ్యారేజ్ చేసుకోవచ్చు
  • కురుక్షేత్రం కోసం ప్రిపేర్ అవుతే కనీసం కుస్తీ పోటీల్లో అయిన గెలవచ్చు

హరినాధ్ దర్శకత్వంలో ,డి శ్రీకాంత్ నిర్మాతగా ,కొమ్ము జేమ్స్ సహ నిర్మాతగా ,అజ్జు మహాకాళి కథ మాటలతో విడుదల అవుతున్న ఈ సినిమా పెళ్లి చూపులు ,ఫిదా లాగా హిట్ అయి తెలంగాణ సినిమా మరొక మెట్టు ఎక్కాలని కోరుకుందాం.

Written By :Ravinder Ryada

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here