‘మేన’రిజం తో కూడిన హోల్ సేల్ వినోదం

0
454

 నటీనటులు- సాయిధరమ్ తేజ్ – రెజీనా – ఆదా శర్మ – బ్రహ్మానందం – నాగబాబు – రావు రమేష్ – అజయ్ – నరేష్ – ఝాన్సీ – రణధీర్ – తేజస్వి తదితరులు

ఛాయాగ్రహణం- సి.రామ్ ప్రసాద్
సంగీతం- మిక్కీ జే మేయర్
నిర్మాత- దిల్ రాజు
కథ – మాటలు – దర్శకత్వం- హరీష్ శంకర్
పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత వస్తున్నా సాయి ధరం తేజ్ సినిమా వస్తుండడం ,గబ్బర్ సింగ్ తర్వాత హిట్ లేని హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వస్తున్నా ఈ సినిమా,  టైటిల్ దగ్గర్నుంచి ట్రైలర్ వరకు అన్నీ ఆకర్షణీయంగా కనిపించడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఏర్పడ్డాయి. మరి సుబ్రమణ్యం ఏమేరకు ఆకట్టుకున్నాడో చూద్దాం పదండి
కథ:
కథ గురుంచి చర్చింటానికి ఏమి లేదు ఎందుకంటే ఇలాంటి సినిమాలు చాల వచ్చాయి , హీరో  ఒక (హీరోహిన్ ) అమ్మాయికి సహాయపడే క్రమంలో భర్తగా నాటకమాడి చివరికి వాళ్ళిద్దరూ ప్రేమించుకునే సినిమా …. గుర్తుకువచ్చాయా?  మొగుడుకావాలి ,బావగారు బాగున్నారా  లాంటి సినిమానే …. హరీష్ శంకర్ కూడా వీటి రిఫరెన్స్ ఇచ్చి ముందుగానే ప్రిపేర్ చేయించాడు … 
కథనం – విశ్లేషణ: 

ఐతే కథ పాతదైన తనదైన శైలిలో వినోదాన్ని పంచాడు హరీష్. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల టీజింగ్ .. సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ వినోదం … ప్లాట్ కూడా రొటీన్ గానే ఉన్న నవ్విస్తాయి . ఐతే ‘రామయ్యా వస్తావయ్యా’ ఫుల్ ఎఫర్ట్ ఫస్టాఫ్ మీద పెట్టి ద్వితీయార్ధాన్ని గాలికొదిలేసిన హరీష్.. ఈసారి ఆ తప్పు చేయలేదు. ప్రథమార్ధాన్ని సోసోగా నడిపించేసి.. ఫోకస్ మొత్తం సెకండాఫ్ మీద పెట్టాడు.
నటీనటులు: 
సాయిధరమ్ ది అంత ఛార్మింగ్ ఫేసేమీ కాదు. కానీ అతడి ఎనర్జీ – ఉత్సాహం అతడి మైనస్ లను కవర్ చేసి హీరో క్యారెక్టర్ తో ప్రేక్షకులు కనెక్టయ్యేలా చేస్తాయి. మేన మామల ని అనుకరిస్తూ సినిమాని రక్తి కట్టించాడు. పైజమా లో సాయి నటన అదుర్స్ .  రెజినా నటన బాగుంది . ఈ సినిమాలో అతి ముఖ్యంగా చెప్పాల్సింది రావు రమేష్ గురుంచి … . ఈ మద్య కాలంలో విభిన్న పాత్రలతో అలరిస్తున్న రమేష్ ,దీంట్లో కూడా చించేశాడు. బ్రాహ్మి ఓకే … 
సాంకేతిక వర్గం: 
మిక్కీ జే మేయర్ తన స్టయిల్ కు భిన్నమైన మ్యూజిక్ ఇచ్చాడు. అన్ని పాటలు situation కి తగ్గట్టు గా ఉన్నాయి ,బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా ఓకే. గువ్వా గోరింక సాంగ్ బాగుంది . రామ్ ప్రసాద్ ఛాయాగ్రహణం కలర్ ఫుల్ గా ఉంది. దిల్ రాజు సినిమా.. నిర్మాణ విలువలు బాగున్నాయి .మాటలు బాగున్నాయి.

రేటింగ్:  3.25/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here