విద్యార్థులే నా గురువులు: చుక్కా రామయ్య

0
56

నా జీవితంలో నేను ఎక్కువ భాగం విద్యార్థుల నుంచే నేర్చుకున్నానని ఐఐటీ గురు,శ్రీ చుక్కా రామయ్య గారు తెలిపారు.ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ నిర్వహించిన ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రోగ్రాం ITAP 2019 లో మహా మహా ఉపాధ్యాయ పురస్కారాన్ని స్వీకరించిన చుక్కా రామయ్య గారు మాట్లాడుతూ మాములుగా అవార్డ్ లకు దూరంగా ఉంటానని కాని ట్యూటర్స్ ప్రైడ్ సంస్థ వాళ్ళ నిజాయితి నాకు,వారు ఎంపిక చేసిన విధానం నచ్చి ఈ అవార్డును స్వీకరిస్తున్నాని తెలియజేశారు.అవార్డ్ అందుకున్న ప్రతి ఉపద్యాయుడుకి ,నిర్వహించిన డాక్టర్ అంకం గారికి అభినందనలు తెలిపారు.

హైదరాబాద్ నడిబొడ్డున ఐటీ కారిడార్లో ఐటీసీ కోహినూర్
హోటల్ లో జరిగినటువంటి మహాత్మా గాంధీ గారి 150వ జయంతి వేడుకల సందర్భంగా ఐడియల్ టీచింగ్ అవార్డ్స్ ప్రోగ్రాం 2019 బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమ్మద్ ఆలీ గారు విద్యుత్ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ గోపాలకృష్ణ, సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ,
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు గారు, బీసీ కమిషన్ మెంబర్ వకుళాభరణం కృష్ణమోహన్,ఎమ్మెల్సీ ఆకుల లలిత,హైదరాబాద్ నగర తొలి మహిళ బొంతు శ్రీదేవి , సురభి మెడికల్ సంస్థ అధినేత శ్రీమతి వాణి గారు,టీనా నాయుడు, సామాజిక వేత్త ,ప్రముఖ నటుడు ఎర్ర సత్య,save global ఫార్మర్స్ సంస్థ అధ్యక్షుడు రవీందర్ ర్యాడా పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here