విదేశాల్లో పై చదువుల కోసం ఓ విద్యార్థి కేటీఆర్ గారికి లేఖ

0
331

గౌరవనీయులైన మంత్రి కేటీఆర్ గారికి …. నమస్కారాలతో రాయటం ఏమనగా …

నా పేరు శేఖర్ … మాది నిజామాబాదు జిల్లాలో ఒక కుగ్రామం . మా అమ్మ నాన్న వ్యవసాయం పని చేసి నన్ను ఇంజనీరింగ్ వరకు చదివించారు. నాకు విదేశాలకు వెళ్లి పై చదువులు చదివి మంచి ఉద్యోగం చేయాలని ఉద్దేశ్యంతో ఇటలి వెళదామని అనుకుని దానికి సంబందించిన పరీక్షలు రాయగా పాస్ అయి తర్వాత ఒక యూనివర్సిటీ నుంచి అడ్మిషన్ రావటం జరిగింది. కాని అక్కడి ఫీజులు చూశాక మాత్రం నా కుటుంబ పరిస్థితి తలుచుకొని విదేశాల్లో కి వెళ్లి చదువుకోవాలనే నా ఆకాంక్ష ను మొదట్లోనే తుంచేయాలని నిర్ణయించుకున్నాను ఎందుకంటే ఆ ఫిజులకు తప్పనిసరిగా బ్యాంకు లోన్ తీసుకు వెళ్ళాలి కాని మా కుటుంబ పరిస్థితుల దృష్ట్యా నాకు ఏ బ్యాంకు కూడా లోన్ ఇవ్వదు,ఒకవేళ వచ్చినా కూడా ఆ లోన్ తీర్చేయటానికి నేను అక్కడ చాలా రోజులు చేసినా కూడా ఆ అప్పు తీరదు . కాని మా మిత్రుడు ఒకరు తెలుగు రాష్ట్రాలు విదేశాల్లో పై చదువుల కోసం ఇస్తున్న స్కాలర్ షిప్పుల గురుంచి చెప్పి నాకు మనోధైర్యం ఇచ్చాడు. కాని తెలంగాణా ఈ -పాస్ వెబ్ సైట్ లోకి చూసాక నా నుదిటి రాతలో విదేశాలకు వెళ్లే యోగ్యం లేదని నాకు అర్థం అయింది. ఎందుకంటే నేను ఎంచుకున్న దేశానికి మన ఈ -పాస్ లో స్కాలర్ షిప్ లిస్ట్ లో లేదు . ఇటలీ తోపాటు డెన్మార్క్ ,పోలాండ్ ,స్వీడన్ ,ఫిన్లాండ్ ,ఆస్ట్రియా మరియు నెదర్లాండ్ దేశాలు కూడా ఆ లిస్ట్ లో లేవు . విచిత్రమైన విషయం ఏంటంటే పైన చెప్పిన దేశాలు కొన్ని ఆంధ్ర ప్రదేశ్ లిస్ట్ లో ఉన్నాయి ,కొన్ని లేకపోయిన కూడా స్కాలర్ షిప్పు లు ఇస్తున్నారు. అయితే అప్పటివరకు నాకు ఒక్కడికి మా స్కాలర్ షిప్పు దొరకటం లేదు అనుకున్న కాని నాలాగా చాల మంది విద్యార్థులు అగమ్య గోచరంగా ఉన్నారని తెలిసి దీనిపైనా కొందరి సలహాలు తీసుకోగా తెలంగాణ ప్రభుత్వానికి ఒక ఉత్తరం రాసి మీకు ట్విట్టర్ లో పోస్ట్ చేయమని సలహా ఇచ్చారు.

వారి సలహాల మేరకు మీకు ఉత్తరం రాస్తున్నాను. మీరు ఈ దేశాలను ఈ పాస్ జాబితాలో వేసి నా బంగారు భవిష్యత్తుకి బాటలు వేయాలని వేల మంది తరపున కోరుకుతున్నాను . ఈ ఉత్తరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాకుండా ఒక ప్రయత్నంగా రాస్తున్నాను.

ఇట్లు ,
మిమ్మల్ని అభిమానించే శేఖర్ నెల్ల
8555847676

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here