హైదరాబాద్ లో అతి వేగానికి చెక్

0
405
Speed guns used in hyderabad traffic police
Speed guns used in hyderabad traffic police

హైద‌రాబాద్ న‌గ‌రంలో ట్రాఫిక్ శాఖ‌ కొత్త నిబంధన తీసుకొచ్చింది. మితి మీరిన వేగంతో వాహనాలు నడిపి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి స్పీడ్ లిమిట్ గంట‌కు 50 కిలోమీట‌ర్లకు తగ్గించింది. అంతకంటే ఎక్కువ స్పీడ్ తో వెళ్ళే వారిపై తగిన చర్యలు తీసుకుంటామని, వాహానాన్ని స్టేషన్ కి తీసుకెళ్తామని హెచ్చ‌రిస్తోంది న‌గ‌ర ట్రాఫిక్ డిపార్ట్‌మెంట్‌. ఓవ‌ర్ స్పీడింగ్‌ను నిరోధించ‌డానికి ప్రాంతాల్లో స్పీడ్ లేజ‌ర్ గ‌న్స్ కెమెరాల ద్వారా త‌నిఖీలు చేస్తున్న‌ట్లు ట్రాఫిక్ డీసీపీ రంగ‌నాథ్ తెలిపారు. న‌గ‌రంలో గ‌రిష్టంగా గంట‌కు 50 కి.మీ వేగం దాట‌కూడ‌ద‌ని కొన్ని చోట్ల ఈ ప‌రిమితి 40 కి.మీ మాత్ర‌మే ఉంటుంద‌ని ప‌రిమితుల‌ను దాటిన వాహ‌నాల‌కు జ‌రిమానాలు విధిస్తున్న‌ట్లు స్ప‌ష్టం చేశారు. ప‌గ‌టి పూట గంట‌కు 80 కి.మీ, రాత్రిపూట గంట‌కు 100 కి.మీ వేగం దాటి ప్ర‌యాణించిన వాహ‌న‌దారుల‌పై కోర్టులో చార్జ్‌షీట్ దాఖ‌లు చేస్తున్న‌ట్లు రంగ‌నాథ్ తెలిపారు .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here