తెలంగాణా పీడియా :సోమరపు సత్యనారాయణ

0
1221

మాములుగా కొందరు నాయకులు ప్రజల్ల్లో నుంచి పుడతారు ,కొందరు పుట్టుకతో వారసులుగా పుడతారు ,మరికొందరు విద్యార్ధి గా పుడతారు కాని కొందరు నాయకులు మాత్రం తమ వృత్తిలో నుంచి పుడతారు. కొందరు పార్టీల నుంచి పుడితే మరి కొందరు పార్టీలకు సంబందం లేకుండా గెలుస్తారు. అలా వృత్తిలో నుంచి పుట్టి పార్టీ లతో సంబందం లేకుండా ప్రజల గుండెల్లో నిలిచిపోయిన నాయకుడు సొమవరపు సత్య నారాయణ . ఒక పక్క మేదావి ,ఇంజనీర్ ,మరో పక్కన తన తోటి ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తూ ఎదురులేని కార్మిక నాయకుడు రామగుండం శాసనసభ్యుడు సత్య నారాయణ గారి గురుంచి మన తెలంగాణా పీడియా లో తెలుసుకుందాం.

వ్యక్తిగతం

సత్య నారాయణ గారు కరీంనగర్ జిల్లా యొక్క మంథని పట్టణంలో జూలై 1948 16 న జన్మించాడు. ప్రసిద్ద వ్యక్తీ సోమవారపు చంద్రయ్య గారు సత్య నారాయణ గారి తండ్రి గారు. సత్య నారాయణ గారు తన ప్రాథమిక విద్యను మంతనిలో చేస్తే ,రామంతాపూర్ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ లో పూర్తీ చేసాడు. ప్రారంభంలో,ఇరిగేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ పని చేసారు.తర్వత భారతదేశం ఎరువులు కార్పొరేషన్ లో 25 ఏళ్ళు గా పని చేసి స్వచ్చంద రిటైర్మెంట్ తీసుకుని ,ఎరువుల ట్రేడ్ యూనియన్ కి ప్రెసిడెంట్ గా పనిచేసిన అయన ,ఇందిరా గాంధీ స్పూర్తితో దేశంలో ఉన్న ట్రేడ్ యూనియనలను ఒక తాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశాడు.

రాజకీయ జీవితం

స్వచ్చంద రిటైర్మెంట్ తీసుకున్నాక కాంగ్రెస్ లో జాయిన్ అయ్యాడు. తర్వాతా PCC సబ్యుడిగా పనిచేసాడు. పి. వి నరసింహ రావు గారి అధ్వర్యంలో గండిపేట్ లో జరిగిన కాంగ్రెస్ శిక్షణ కార్యక్రమంలో ట్రైనర్ గా చాలా బాగా పనిచేయతంతో PCC లో మేదవుల సెల్ కి కన్వినర్ గా ఎంపిక అయ్యాడు. దాని తర్వాత 1998 లో రామగుండం మున్సిపల్ చైర్మెన్ గా ఎన్నిక కావటంతో సత్యనారాయణ గారి ప్రత్యక్ష రాజకీయాలకు పునాది పడింది. అయన హయంలో అవినీతి వ్యతిరేకంగా చాల కార్యక్రమాలు జరిగాయి, రామగుండము ని అవినీతి రహిత పట్టణంగా చరిత్రలోకి ఎక్కించాడు. అంటే కాకుండా రాష్ట్రంలో 24 గంటల నీటి సదుపాయం గల పట్టణంగా తీర్చిదిద్దాడు,డయాల్ యువర్ చైర్మెన్ ,మహిళ రాజ్యదికరం ,క్రీడల కమిటీ లాంటివి దేశంలోనే రామగుండము కి పేరు తెచ్చింది . 2009 స్వతంత్ర అభ్యర్థిగా పోటి చేసి రామగుండము ఎమెల్యే గా ఎన్నికయి చరిత్ర సృష్టించాడు. మొదట్లో కాంగ్రెస్ పార్టీ కి మద్దతు ఇచ్చినా తర్వాత తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా తెరాస చేరి తెరాస కి బలంగా మారిపోయాడు. మళ్ళి 2014 లో తెరాస తరపున మళ్ళి భారి మెజారిటి తో గెలిచి బంగారు తెలంగాణాలో భాగం అయ్యాడు. ఇపుడు తెలంగాణా రాష్ట్రంలో మొట్టమొదటి RTC చైర్మైన్ గా ఎంపిక అయ్యాడు. నిజానికి నష్టాల్లో ఉన్నా RTC ని గాడిలో పెట్టటానికి సోమరపు లాంటి వ్యక్తీ సేవలు ,అయన అదునీక ఆలోచనలు అవసరమని ముఖ్యమంత్రి కెసిఆర్ బావించి ఆయనకు ఈ పదవి కట్టిపెట్టినట్టు సమాచారం.
పూర్తీ వివరాలు
పేరు: సోమరపు సత్యనారాయణ
తండ్రి పేరు : శ్రీ . సోమరపు చంద్రయ్య గారు
పుట్టిన తేదీ: 16.07.1948
జన్మస్థలం: మంథని , కరీంనగర్ జిల్లా.
అర్హతలు: L.C.E , M.I.E. , M.B.A
కొడుకు :సోమరపు అరుణ్ కుమార్ (రాష్ట్ర తెరాస యువ నాయకుడు )
భవిష్యత్తులో సత్యనారాయణ గారు మరిన్ని విజయాలను సాదించాలని ఆశిద్దాం.
SOURCE :http://somarapusatyanarayana.com/personal-profile/

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here