మధ్యాహ్న భోజనంలో పాముపిల్ల

0
654
snake in mid day food
snake in mid day food

అధికారుల చేతకానితనం, విధి నిర్వహణలో అలసత్వాన్నికి అమాయక పసి పాపలు బలైపోతున్నారు. ప్రభుత్వ అధికారుల సోమరితనం వారి పాలిట శాపంలా మారుతుంది. హర్యానాలోని ఫరీదాబాద్ రాజకీయ గర్ల్స్ సీనియర్ సెకండరీ స్కూల్ లో మధ్యాహ్న భోజనం లో పాము పిల్ల కనిపించింది. ఆ ఆహారం తిన్న పిల్లలు ఆస్పత్రుల పాలయ్యారు. ఇది అక్కడి ఉద్యోగుల అలసత్వానికి ప్రతీక. మధ్యాహ్న భోజనం కోసం తయారు చేసిన పప్పు అన్నం లో ఓ పాము పిల్ల కనిపించడంతో స్కూల్ ప్రిన్సిపాల్ ఆ భోజనాన్ని తీసివేశారు. అప్పటికే కొంత మంది ఆహారాన్ని తినడంతో వాంతులు చేసుకున్నారు. ఈ విషయం గమనించి వారిని హుటా హుటిన ఆస్పత్రికి తరలించారు. ఈ ఆహారం ఇస్కాన్ ఫుడ్ రిలీఫ్ పౌండేషన్ నుంచి సరఫరా అవుతోంది. ఈ విషయం పై స్కూల్ ఉపాధ్యాయులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here