ప్రపంచంలోనే అత్యంత చిన్న మొబైల్

0
290
smallest phone in the world
smallest phone in the world
    ప్రపంచంలోనే అత్యంత చిన్న మొబైల్ ను ఎలరీ అనే టెక్నాలజీ సంస్థ మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ మొబైల్ కి ఎలరీ నానోఫోన్ సీ అని పేరు పెట్టారు. ఇండియా మార్కెట్ లోకి ఇవాళే (జూలై 14) విడుదల అయిన ఈ ఎలరీ నానోఫోన్ ధర రూ.3,940 మాత్రమే. ఈ బుల్లి మొబైల్ ఫోన్ లో కూడా రెండు మైక్రో సిమ్ లు వేసుకోవచ్చు.దీని బరువు కూడా 30గ్రాములు మాత్రమే. FM రేడియో, వాయిస్ రికార్డర్ ,MP3 ప్లేయర్ కూడా ఉంది. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఈ మొబైల్ సైజు ఎంతో వింటే షాక్ అవుతారు. దీని సైజు చెప్పాలంటే (సైజు 94.4×35.85×7.6mm)మన బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్ కన్నా తక్కువ సైజులోనే ఉంటుంది. ఒక్క సారి చార్జింగ్ పెడితే నాలుగు రోజలు పని చేస్తుందని చెబుతోంది కంపెనీ.www.yerha.com లో అందుబాటులో ఉంది.
    ఇక దీని ఫీచర్స్ విషయానికి వస్తే…
    డిస్ ప్లే : అంగుళం, ర్యామ్ : 32MB, ఇంటర్నల్ స్టోరేజీ : 32GB, ఆపరేటింగ్ సిస్టమ్ : RTOS, బ్యాటరీ : 280 mAh

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here