జీరో సైజు: కథ లో జోరు – కథనానికి లేదు గేరు

0
406

బాహుబ‌లి, రుద్ర‌మదేవి చిత్రాలు త‌ర్వాత అనుష్క చేసిన మరో సినిమా ,ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ కావటం ఆస‌క్తి సైజు జీరో పైన ఏర్ప‌డింది. ఈ చిత్రంలో టైటిల్ చూస్తేనే సినిమా ఫిట్‌నెస్‌కు సంబంధించిన‌ద‌ని అర్థ‌మ‌వుతుంది. సినిమాలోని పాత్ర‌కు న్యాయం చేయాల‌నుకుందో ఏమో కానీ స్వీటీ ఆనుష్క సిన‌మాలో భారీగా క‌న‌ప‌డ‌టానికి బ‌రుపు పెరిగింది. అనగనగ ఒక ధీరుడు తర్వాత ప్రకాష్ తీస్తున్న ఈ సినిమా ఎలా ఉందొ సమీక్షా లో చూడాల్సిందే .

క‌థ‌:

అధిక‌మైన బ‌రువు కార‌ణంగా రాజేశ్వ‌ర‌మ్మ‌(ఊర్వ‌శి) కూతురు సౌంద‌ర్య‌(అనుష్క‌)కు పెళ్ళి కాదు. సౌంద‌ర్య‌ను అంద‌రూ స్వీటీ అని ముద్దుగా పిలుస్తుంటారు. లా పెళ్ళి సంబంధాలు వ‌చ్చినా ఆమె లావుగా ఉంద‌నే కార‌ణంతో ఆమెకు పెళ్ళికాదు. కానీ ఈ విష‌యం పట్ట‌న‌ట్టు త‌న‌కు కావాల్సింది తింటూ ఉంటుంది. పెళ్ళిచూపుల‌కు వ‌చ్చిన అభి(ఆర్య‌)ను ఇష్ట‌ప‌డిన స్వీటీ, యాటిట్యూడ్‌ను ఇష్ట‌ప‌డిన అభి ఆమెతో స్నేహం చేస్తాడు. క్లీన్ ఇండియా అనే కాన్సెప్ట్‌ను డాక్యుమెంట‌రీగా తీసే కార్య‌క్ర‌మంలో భాగంగా అభికి ఎన్‌జివో సిమ్రాన్‌(సోనాల్ చౌహాన్‌) ప‌రిచ‌యం అవుతుంది. మొద‌ట్లో అభి, సిమ్రాన్‌ను ఇష్ట‌ప‌డ‌టం చూసి స్వీటీ బ‌రువు త‌గ్గాల‌నుకుంటుంది. అందుక‌ని సైజ్ జీరో ఫిట్‌నెస్ సెంట‌ర్ య‌జ‌మాని స‌త్యానంద్‌(ప్ర‌కాష్‌రాజ్‌)ను క‌లుస్తుంది. స‌త్యానంద్ ట్రీట్‌మెంట్ స్టార్ట్ చేస్తాడు. అప్పుడు క‌థ ఓ మ‌లుపు తీసుకుంటుంది. సైజ్‌జీరో సంస్థ‌పై స్వీటీ పోరాటం స్టార్ట్ చేస్తుంది. అప్పుడేమ‌వుతుంది? అస‌లు బ‌రువు త‌గ్గాల‌నుకున్న స్వీటీ ఏం చేస్తుంది? అభి, సిమ్రాన్‌లు ఏం చేస్తారు? అస‌లు స్వీటీ క‌థ ఎలాంటి మ‌లుపులు తీసుకుంటుందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే..

ప్లస్ పాయింట్స్ :

అనుష్క లీడ్ రోల్‌లో సినిమా కోస‌మ‌నే బ‌రువు పెర‌గ‌డం, త‌గ్గ‌డం చేసి సినిమా కోసం త‌నెంత క‌మిటెడ్ ప‌ర్స‌నో అని నిరూపించుకుంది. త‌న పాత్ర ప‌రంగా లావుగా ఉన్న‌ప్పుడు లావు త‌గ్గ‌డానికి మ‌నో సంఘ‌ర్ష‌ణ ప‌డే సమ‌యంలో, త‌న ప్రేమ కోసం తాప‌త్ర‌య‌ప‌డే సంద‌ర్భంలో బాగానే న‌టించింది. ఆర్య కూడా హ్యండ్‌స‌మ్‌గా క‌నిపించాడు. కూతురి పెళ్ళి కోసం తాప‌త్ర‌య‌ప‌డే తల్లిపాత్ర‌లో ఊర్వ‌శి చ‌క్క‌గా న‌టించారు. ప్ర‌కాష్ రాజ్‌, భ‌ర‌త్‌, గొల్ల‌పూడి మారుతీరావు త‌దిత‌రులు త‌మ త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. కీర‌వాణి సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బావుంది. అలాగే నిర‌వ్ షా సినిమాటోగ్ర‌ఫీ ఆక‌ట్టుకుంటుంది.
మైనస్ పాయింట్స్ :
సినిమా రెండు గంట‌ల ప‌ద‌కొండు నిమిషాలే అయినా లాగిన‌ట్టుగా ఉంటుంది. ఎడిట‌ర్ ప్ర‌వీణ్ పూడి కాస్తా జాగ్ర‌త్త తీసుకుని ఉంటే బావుండేది. ఈ సినిమాలో ఎక్కువ‌గా అమ్మాయి పెళ్లి కోసం లావుత‌గ్గాల‌నుకోవ‌డ‌మే బాధాక‌రం. ఓ వ్య‌క్తి లావుగా ఉంటే ప‌డే మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌ను మ‌రింత బాగా తెర‌కెక్కించి ఉంటే ప్రేక్ష‌కుడు మ‌రింత క‌నెక్ట్ అయ్యేవాడు. మంచి కార‌ణంతో ప‌నిచేసేవారికి అంద‌రూ స‌పోర్ట్‌గా ఉంటార‌ని చెప్ప‌డానికి నాగార్జున‌, రానా, జీవా, లక్ష్మి ప్ర‌స‌న్న‌, హ‌న్సిక‌, త‌మ‌న్నా, శ్రీదివ్య‌లు క‌నిపించే స‌న్నివేశాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటాయి. నిర్మాణ విలువ‌లు బావున్నాయి.

విశ్లేష‌ణ‌:

వెయిట్ పెర‌గ‌డం, త‌గ్గ‌డం,ఫిట్‌నెస్ సెంట‌ర్ ఇలాంటి ప‌దాలు స‌రే వాటిపై వ‌చ్చే సినిమాలు కూడా మ‌ల్టీప్లెక్స్ ఆడియెన్స్‌కే ప‌రిమితం అవుతాయి. మ‌రి బి, సి సెంట‌ర్ ప్రేక్ష‌కులు ఆద‌ర‌ణ క‌ష్టంగానే అనిపిస్తుంది. త‌నను ప్రేమించే వాడు కావాల‌నుకునే అమ్మాయి, అలాంటి అబ్బాయి దొర‌క‌గానే మ‌ళ్ళీ ఆర్య త‌న‌ను ప్రేమిస్తున్నాడ‌ని తెలుసుకుని వెళ్ళిపోవ‌డం క‌న్విసింగ్‌గా అనిపించ‌దు. ఎమోష‌నల్‌గా ప్రేక్ష‌కుడు ఎక్క‌డా క‌నెక్ట్ కాక‌పోవ‌డం, కామెడి ప‌ర్సెంటేట్ త‌క్కువ‌గా ఉన్నాయి. సినిమాను ఓసారి చూడొచ్చు.

verdict సైజ్ జీరో: కథ జోరు – కథనానికి లేదు గేరు

రేటింగ్ 2.75/5

సంస్థ:పివిపి

తారాగణం: అనుష్క‌, ఆర్య‌, సోనాల్ చౌహాన్‌, ఊర్వ‌శి, ప్ర‌కాష్ రాజ్‌, రావుర‌మేష్‌, గొల్ల‌పూడి మారుతీరావు, హేమ‌, అలీ, అడ‌విశేష్, భ‌ర‌త్ త‌దిత‌రులు

కెమెరా: నిర‌వ్‌షా కూర్పు- ప్ర‌వీణ్‌పూడి

మ్యూజిక్: యం.యం.కీర‌వాణి

ఆర్ట్: ఆనంద్‌సాయి

క‌థ‌-స్క్రీన్‌ప్లే: క‌ణిక కోవెల‌మూడి

నిర్మాత‌: ప్ర‌సాద్ వి.పొట్లూరి

ద‌ర్శ‌క‌త్వం: ప్ర‌కాష్ కోవెల‌మూడి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here