16 పబ్‌లకు నోటీసులు డ్రగ్స్ కేసులో….

0
282
sit enqiry in pubs
sit enqiry in pubs

డ్రగ్స్ కేసులో ఇప్పటివరకూ సినీ ప్రముఖులను విచారించిన సిట్ ఇప్పుడు పబ్‌లపై దృష్టి పెట్టింది. హైదరాబాద్‌లో డ్రగ్స్ కు అడ్డాగా మారిన పలు పబ్‌లకు నోటీసులు పంపించింది. ఇటీవల సినీ ప్రముఖులు, కెల్విన్ తదితర వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో నగరంలో మత్తుమందుల సరఫరాకు కారణమవుతున్న పలు పబ్‌లను అధికారులు గుర్తించారు. ఇప్పటివరకూ 16 పబ్‌లకు నోటీసులు పంపించినట్లు సిట్ అధికారులు తెలిపారు. శనివారం (ఆగస్టు 19) ఉదయం 11 గంటలకు సిట్ ఆఫీసులో హాజరు కావాలని ఆయా పబ్ ఓనర్లను ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here