రవీంధ్ర భారతి లో ఘనంగా TSFA -2019 పోస్టర్ ఆవిష్కరణ

0
160

(తెలుగు షార్ట్ ఫిలిం అవార్డ్స్) TSFA -2019 పోస్టరును లాంగ్వేజ్ మరియు కల్చరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, శ్రీ మామిడి హరికృష్ణ గారు మరియు బీసీ కమిషన్ చైర్మన్ బి.యస్. రాములు గారు రవీంద్ర భారతిలో ఆవిష్కరించారు. ఈ పోస్టర్ ఆవిష్కరణలో కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ యం.డి. శ్రీనివాస్ మర్రి, సంతోష్ నడిగొట్టు, రోహిత్ రావు వక్రాల, ధర్మాన షణ్ముఖ మరియు చెరుకూరి శివ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పోస్టర్ ఆవిష్కరణ చేసిన శ్రీ మామిడి హరికృష్ణ గారు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం ఈ షార్ట్ ఫిలిం అవార్డు ఫంక్షన్ ను నిర్వహిస్తున్న కళారాజ్ మీడియా అండ్ ఎంటెర్టైనెంట్ ఎంతోమంది కళాకారులను మరియు ప్రతిభ గల యువకులను ప్రోత్సహిస్తుందని అన్నారు. ఇలాంటి మంచి పనులకు ప్రభుత్వ సహాయం ఉంటుంది అని తెలియజేసారు. బి.యస్ రాములు గారు మాట్లాడుతూ ప్రతి యొక్క నూతన దర్శకులకు మరియు కళాకారులకు ఇది ఒక మంచి అవకాశం అని తెలియజేసారు. ప్రతి ఒక్కరు దీన్ని వినియోగించుకోవాలని చెప్పారు. కళారాజ్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ ఈ ఈవెంట్ లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన దర్శకులకు మరియు కళాకారులకు అవార్డ్స్ తో పాటు రివార్డ్స్ కూడా ఇస్తుంది అని తెలియజేసారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ జులై 1 నుండి ఆగష్టు 15 వరకు ఉంటుంది అని తెలియజేసారు.
ఇతర వివరాలకై సంప్రదించాల్సిందిగా
7036201234 మరియు 9133641234.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here