IBM ఉద్యోగులలో కలకలం

0
577
Shocking news to ibm employees layoff
Shocking news to ibm employees layoff
    భారత ఐటీ పరిశ్రమ మరింత దిగజారే పరిస్థితి నెలకొననుంది. దిగ్గజ ఐటీ కంపెనీ లు అన్ని వారి వారి ఉద్యోగులకి ఉద్వాసన పలికేందుకు తయారవుతున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే భారత దేశంలో నిరుద్యోగ సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది. దీనితో రానున్న రోజుల్లో ఐటీ ఉద్యోగులకు గడ్డు కాలం ఎదురయ్యె అవకాశం ఉంది.
    ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్‌లు సంస్థలు ఇప్పటికే కొన్ని వేల మంది ఉద్యోగులను తొలగించేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తుండగా ఇప్పుడు ఐబిఎం కూడ దాదాపు గా 5000 మందిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. దీనితో ఐబిఎం ఉద్యోగులలో కలవరం మొదలైంది. నైపుణ్యం లేని ఉద్యోగులను గుర్తించాల్సింది గా ఇప్పటికే కంపెనీ మేనజర్లకు ఆదేశాలు అందాయని సమాచారం . ఈ క్రమంలో ఎటువంటి నియామకాలు ఉండవనే కంపెనీ చెప్పకనే చెపుతుంది. ఉద్యోగుల భవిష్యత్తుపై ఇది ఒక పెద్ద గుది బండగా పేర్కొనవచ్చు. ప్రస్తుతం భారత్‌లో ఐబీఎం ఉద్యోగులు 1.50 లక్షల మంది ఉన్నారు. వీరిలో సంస్థ నుంచి ఎంతమందిని ఉద్యోగులను తొలగించేది, ఎటువంటి ఉద్యోగులను తొలగించేది కంపెనీ నుంచి ఎటువంటి స్పష్టమైన సమాచారం వెలువడలేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here