కేసీఆర్ కి ముచ్చెమటలు పట్టించిన విద్యార్థులు

0
826
Shocking incident to KCR in OU
Shocking incident to KCR in OU
    తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే సి ఆర్ కి విద్యార్థుల నుంచి సెగ తగిలింది. ఉద్యమాల పోరు బిడ్డ మన ముఖ్యమంత్రికి భారత రాష్ట్రపతి ముందే నిరసనలు వెల్లువెత్తాయి. తెలంగాణలో ఎందరో ఉద్యమకారులకు, మేధావులకు, భావి భారత పౌరులను అందించిన ఉస్మానియా శత జయంతి ఉత్సవాలలో తెలంగాణ ముఖ్యమంత్రిపై నిరసన జ్వాలలు చుట్టుముట్టాయి. రైతులకు 9 గంటల విద్యుత్త్ ఇచ్చి రైతు భాందవుడయ్యాడు. కాని ఉస్మానియాలో అదే రైతన్న కొడుకుల ఆక్రోశానికి లోనయ్యాడు. ఉస్మానియా విద్యార్థుల నిరసనల వల్ల మాటల మాంత్రికుడి పెదవి నుండి ఒక్క మాట కూడ రాలేదు.
    భారత దేశంలోని అన్ని రాష్ట్రాలలో అత్యుత్తమ ముఖ్యమంత్రిగా దేశ ప్రధానిచే మన్ననలు పొందిన కేసీఆర్ స్వరాష్ట్రంలో విద్యార్థుల ఆవేదన పట్టించుకోలేక వారికి నిరసనలకి ఆహుతయ్యడు. తెలంగాణ ఉద్యమానికి పురిటిగడ్డ ఉస్మానియాలో కేసీఆర్ డౌన్ డౌన్ – సియం కేసీఆర్ డౌన్ డౌన్ అంటూ ఉస్మానియా దద్దరిల్లేలా నినాదాలు చేసారు. నిన్నటి నిరసన జ్వాలలు సియం కే సి ఆర్ కి భవిష్యత్త్ పై చాలా ప్రభావం చూపడం ఖాయం. విద్యార్థుల జీవితాలతో చలగాటాలు ఆడే ప్రతి నాయకునికి నిన్నటి నిరసన జ్వాలలు ఒక హెచ్చరికలా సందేశం ఇచ్చారు. తెలంగాణ వచ్చాక తమ జీవితాలు మారుతాయి. తమ ఉద్యోగాలు తమకే దక్కుతాయి అని నమ్మి ఓట్లేసిన విద్యార్థులని పట్టించుకోక పోవడం, అడపా దడపా ఉద్యోగ నోటిఫికేషన్స్ వేస్తున్న అవి ఎదో ఒక విధంగా వాయిదా పడటం లేద కోర్టు లో ఉండి పోవడంతో విద్యార్థులో అసహనం పెరిగి ఒక్క సారిగా తమ నిరసనలతో ముచ్చెమటలు పట్టించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here