తెలంగాణలో కోటిన్నర గొర్రెల పంపిణీ

0
295
kcr new scheme
kcr new scheme
    తెలంగాణ రాష్ట్రంలో గొల్ల, కుర్మలను అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ గొర్రెల పంపిణీ పథకాన్ని చేపట్టారు. ఈ పథకం లో భాగంగా మొదట కొండపాకలో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు.

    ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామాలను అభివృద్ధి చేయాలని గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం డెవలప్ అవుతుందని అన్నారు. ఇందుకోసం గ్రామాలలోని గొల్ల, కుర్మలకు కోటిన్నర గొర్రెల పంపిణీకి శ్రీకారం చుట్టామన్నారు. ఈ అభివృద్ధికి సిద్ధిపేట జిల్లా కొండపాక నుంచి బలమైన పునాది పడిందన్నారు సీఎం కేసీఆర్…

    గొర్రెలు పంపిణీ కోసం 7 లక్షల 61వేల దరఖాస్తులు వస్తే 7 లక్షల 18 వేల మందికి ఈ పథకం మంజూరయ్యిందన్నారు. లబ్ధిదారులకు గొర్రెలను పంపిణీ చేసేందుకు కోటిన్నర గొర్రెలను దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి గొర్రెకు ప్రభుత్వ ప్రీమియంతో బీమా సౌకర్యం కలిపిస్తామన్నారు. అంతేకాకుండా 1962 నెంబర్ కు ఫోన్ చేస్తే వాటికి ఎలాంటి వైద్యం అయినా అందుబాటులో ఉండేలాగా అన్ని ఏర్పాట్లు చేసామన్నారు. మూడేళ్లలో రూ. 25 వేల కోట్ల సంపదను గొల్లకురుమలు సృష్టించబోతున్నారన్నారు.కొండపాక గ్రామ అభివృద్ధికి 10 కోట్లు కేటాయిస్తున్నట్లు దీనికి సంబంధించిన జీవోనే రేపే విడుదల చేస్తామన్నారు.

    వచ్చే ఏడాది జూన్‌ తర్వాత సిద్ధిపేటకు గోదావరి నీళ్లొస్తాయని, రైతులకు 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని అన్నారు. అంతేకాకుండా రైతులకు ఎకరాకు ఎనిమిది వేల రూపాయల ఎరువుల పెట్టుబడి ఇస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here