తెలంగాణా పీడియా : ఉద్యమాల రాజు శంబిపూర్ రాజు

0
738

స్వతంత్రం వచ్చాక నాయకులు ఉద్యమాల్లో నుంచి పుడతారు అని నిరుపితం అయింది . 1970 లో రౌడిఈజమ్ నుంచి నాయకులు వచ్చారు, 1980 నుంచి రాజకీయ నాయకులూ మొత్తం కులం నుంచి ,మతం నుంచి వచ్చారు . 1994 లో రౌడీజం వ్యాపారం ,కార్పొరేట్ రంగం నుంచి నాయకులూ తయారయ్యారు . కాని 2001 తర్వాత కెసిఆర్ పుణ్యమా అని మళ్ళి తెలంగాణా ఉద్యమం నుంచి నాయకులు, కళాకారులూ కూడా వెలుగులోకి వచ్చారు .
అలాంటి నాయకులలో ఒక 20 మందిని ముందు వరుసలో నిలబెడితే హరీష్ రావు ,కవిత ,కేటిఆర్ ,వినయ్ భాస్కర్ ,జీవన్ రెడ్డి ,ప్రశాంత్ రెడ్డి ,గణేష్ గుప్త లాంటి వాళ్ళు మనకు కనపడతారు . కాకపోతే వీళ్ళందరికీ రావాల్సిన గుర్తింపు ముందే వచ్చింది కాని కొందరికి ఇంకా రాలేదు. కాని ఒక వ్యక్తీ కి మాత్రం రావాల్సిన గుర్తింపు లేట్ గా వచ్చిన లేటెస్ట్ గా వచ్చింది . ఆయనే ఉద్యమాల్లో రాజు ,శంబిపూర్ రాజు అలియాస్ సుంకరి రాజు . ఉద్యమ సమయం లో తెలంగాణా వచ్చేదాకా గణేష్ ని నిమ్మజనం చేయనని ప్రతిన పూని కెసిఆర్ స్వయంగా వచ్చి నిమజ్జనం చేయించటం లాంటివి చేయటం ద్వారా కెసిఆర్ దృష్టిలో పడ్డాడు .మన తెలంగాణా కబుర్లు లో ప్రముకుల గురుంచి తెలుపున్న తెలంగాణా పెడియా లో ఈ వారం శంబిపూర్ రాజు గురుంచి తెలుసుకుందాం .

వ్యక్తిగతం
జననం :1980, జనవరి 4
తల్లితండ్రులు :ఆంజనేయులు, వినోద
భార్య :లావణ్య
కొడుకు & కూతురు :దీపక్ & స్నికిత
స్వగ్రామమ :శంబిపూర్
చేపట్టిన పదవులు
2001లో టీఆర్‌ఎస్ పార్టీ మండల కోశాధికారిగా, బీసీ సెల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, యువజన విభాగం సెక్రటరీ జనరల్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేశాడు.
ప్రత్యక్ష ఎన్నికలు
2015 లో స్తానిక సంస్థల mlc ఎన్నికల్లో విజయం సాదించాడు
2006 లో శంబిపూర్ వార్డ్ మెంబెర్ గా పోటి చేసి గెలిచాడు
ప్రత్యేకతలు
ఉద్యమ సమయం లో తెలంగాణా వచ్చేదాకా గణేష్ ని నిమ్మజనం చేయనని ప్రతిన పూనటం
తెలంగాణా వచేదాక పుట్టిన రోజు సంబరాలు జరపక పోవటం
వరంగల్ సభకు విరాళాల సేకరణ నిమిత్తం కేసీఆర్ కూలి పనులు చేసేందుకు సిద్దం కాగా అందుకు కుత్బుల్లాపూర్‌ను ఎంపిక చేయడంలో ఆయన కీలకపాత్ర
పోషించడమేగాక, రూ. 50 లక్షలు సేకరించి కేసీఆర్‌తో శభాష్ అనిపించుకున్నాడు.
శంభీపూర్ రాజు రెండు శాసన మండళ్లలో అందరికంటే చిన్నవాడు కావడం

shambi2

 

ఇపుడు స్తానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందటం ద్వారా అయన స్వగ్రామం అయిన శంబిపూర్ లో సంబరాలు మొదలయ్యాయి . అల్ ది బెస్ట్ రాజు గారు.ఈ నెల నాల్గున పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయనకి తెలంగాణా కబుర్లు బెస్ట్ విషెస్ చెప్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here