శంబిపూర్ లో సంబరాలు

0
371

నిన్న వచ్చిన పెద్దల సభ ఫలితాల్లో ఏకగ్రీవం పోను తెరాస కి 4 సీట్లు వచ్చాయి ,కాంగ్రెస్ కి 2 వచ్చాయి . అందరిలో ఒక మనిషి మాత్రం వార్తల్లో వ్యక్తీ గా నిలుస్తున్నాడు . ఉద్యమంలో అయన చేసే ప్రతి పని కొత్తగా ఉండటం ,ప్రజలకి సులభంగా చోచుకుపోవటం   లాంటివి  ఆయన్ని కెసిఆర్ కి దగ్గర చేసాయి . వరంగల్ సభకు విరాళాల సేకరణ నిమిత్తం కేసీఆర్ కూలి పనులు చేసేందుకు సిద్దం కాగా అందుకు కుత్బుల్లాపూర్‌ను ఎంపిక చేయడంలో ఆయన కీలకపాత్ర పోషించడమేగాక, రూ. 50 లక్షలు సేకరించి కేసీఆర్‌తో శభాష్ అనిపించుకున్నాడు.   ఉద్యమ సమయం లో తెలంగాణా వచ్చేదాకా గణేష్ ని నిమ్మజనం చేయనని ప్రతిన పూని కెసిఆర్ స్వయంగా వచ్చి నిమజ్జనం చేయించటం లాంటివి కెసిఆర్ కి ఇంకా దగ్గర చేసాయి . అయన ఎవరో కాదు తన ఊరు పేరు ని ఇంటి పేరు గా మార్చుకున్న శంబి పూర్ రాజు అలియాస్ సుంకరి రాజు .1980, జనవరి 4న ఆంజనేయులు, వినోద దంపతులకు జన్మించిన రాజు పాఠశాల స్థాయి నుంచే ఉద్యమాల్లో పాల్గొనేవాడు

2001లో టీఆర్‌ఎస్ పార్టీ మండల కోశాధికారిగా, బీసీ సెల్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, రంగారెడ్డి జిల్లా టీఆర్‌ఎస్ యువజన విభాగం అధ్యక్షునిగా, రాష్ట్ర ప్రచార కార్యదర్శిగా, యువజన విభాగం సెక్రటరీ జనరల్‌గా, నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యతలు నిర్వహించి పార్టీ పటిష్టతకు కృషి చేశాడు.

ఇపుడు స్తానిక సంస్థల శాసన మండలి ఎన్నికల్లో గెలుపొందటం ద్వారా అయన స్వగ్రామం అయిన శంబిపూర్ లో సంబరాలు మొదలయ్యాయి . అల్ ది బెస్ట్ రాజు గారు.ఈ నెల నాల్గున పుట్టిన రోజు జరుపుకుంటున్న ఆయనకి తెలంగాణా కబుర్లు బెస్ట్ విషెస్ చెప్తుంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here