మట్టి గణపయ్య తో సెల్ఫీ దిగండి…బంగారాన్ని గెలుచుకోండి

0
508
selfie with eco ganesha
selfie with eco ganesha
    సకల దేవతాగణములకు అధిపతి , శివ పార్వతులు పెద్ద కుమారుడు అయిన విజ్ఞేశ్వరుడు అంటే సకల జివ రాశులు భక్తి పారవశ్యంతో మునిగిపోతాయి
    మన దేశంలో గణేశ చతుర్థి ఒక ముఖ్యమైన పండగ.
    అడ్డంకులను తొలగించు వాడు , అన్ని కార్యాలకు, శుభములకు, పూజలకు ప్రప్రధముగా పూజింపవలసినవాడు వినాయకుడు. కావున ఇట్టి పర్వదినాన మన దేశంలో గల్లి గల్లిలో గణేశ చతుర్థి వేడుకలను వైభవంగా నిర్వహిస్తుంటారు.

పూర్వం మట్టి తో చేసిన విగ్రహాలను పూజింస్తూ భక్తి పారవశ్యంలో మునిగిపోయేవారు.
ప్రస్తుతం విగ్రహాల తయారికి విషపూరిత రంగులు, పదార్థాలు ఉపయోగించి తయారు చేస్తూ పర్యావరణాన్నికి హాని కలిగిస్తున్నారు. ఈ రకమైన చర్యలకు పరిష్కారంగా ప్రతి ఒక్కరు మట్టి విగ్రహాలను పూజించాలని పర్యావరణ ప్రేమికులు అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అవగాహణ కల్పిస్తున్నారు.

దీనిలొ భాగంగా ” ఆలివ్ మిఠాయి – సాక్షి ” సంయుక్తంగా మట్టి విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుతూ ఒక కంటెస్ట్ ను నిర్వహిస్తుంది. మట్టి గణపయ్య తో సెల్ఫీ దిగండి…బంగారాన్ని గెలుచుకోండి అంటూ మట్టి విగ్రహాలతో సేల్ఫి దిగి, వారు పొందుపరిచిన మొబైల్ నంబర్(97050 12000) కి మెస్సేజ్ చేసి బంగారాన్ని గెలుపొందోచ్చు అని కొత్త తరహా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మట్టి గణపతిని పూజించాలి అని ఒక నినాదాన్ని ఆలివ్ స్వీట్స్ యజమాని దొర రాజు గారు 10 సంవత్సరాల క్రితం మొదలుపెట్టి, ఇపుడు అందరిలో మట్టి గణపతి విశిష్టత తెలిసేలా చేస్తున్న ఆయన కృషిని అందరూ అభినందించాల్సిందే.  ఇలాంటి కార్యక్రమాల వల్ల ప్రజలలో కొంత వరకైనా అవగాహన ఏర్పడుతుందని ఆశిద్దాం.

పర్యావరణాన్ని రక్షించుకోవడం ప్రతి ఒక్క మానవుని కర్తవ్యం.

మట్టి విగ్రహాలనే ప్రతిష్టిద్దాం….. పర్యావరణాన్ని కాపాడుకుందాం…..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here