మహేష్ కి రెండువైపుల బలంగా పనిచేస్తున్న ద్వితీయ విజ్ఞం

0
1900

ఇదేంటి ద్వితీయ విఘ్నం రెండో ఆటంకం కదా ,మరి దాదాపు పాతిక సినిమాలు హీరోగా ,9 సినిమాలు చైల్డ్ అరిస్ట్ గా పనిచేసిన మహేష్ కి ద్వితీయ విఘ్నం ఏంటి అనుకుంటున్నారా ?అవును .. కాని మీరనుకున్నట్లు మహేష్ రెండవ సినిమా వలన కలిగే ఆటంకం కాదు. అయన ఏదైనా ఒక సినిమా ఒక దర్శకుడితో రెండో సరైన సరే ,లేదా ఏదైనా నిర్మాత రెండో సారి నిర్మిస్తే డమాల్ అని శబ్దం వస్తుంది. అదేంటో ఒకసారి కింద చూద్దాం.

  • అయన కెరీర్ లో హీరోగా మొదటి సినిమా రాజకుమారుడు దానికి దర్శకుడు రాఘవేంద్ర రావు ఇది హిట్ అయింది. మళ్ళి దర్శకేంద్రుడి నిర్మాణంలో తీసిన సినిమా బాబి అట్టర్ ఫ్లాప్ .
  • అదే రాజకుమారుడికి అశ్వనిదత్ నిర్మాత ,మళ్ళి అయన నిర్మాణంలో వచ్చిన సినిమా సైనికుడు ఫలితం ఏంటో మనకు అందరికి తెలుసు.
  • ఇక గుణ శేకర్ తీసిన ఒక్కడు ఎంత హిట్ అయిందో మనకు తెలుసు ,దాని తర్వాత వచ్చిన అర్జున్ ,సైనికుడు చేదు అనుభవాన్ని ఇచ్చాయి.
  • త్రివిక్రమ్ తీసిన మొదటి సినిమా అతడు హిట్ అయింది ,కాని ఖలేజ కంటెంట్ బాగున్నా కూడా కమర్షియల్ డిసాస్టర్.
  • శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు బ్లాకు బస్టర్ తర్వాత వచ్చిన ఆగడు సూపర్ ఫ్లాప్ .
  • అనిల్ సుంకర నిర్మాణంలో వచ్చిన దూకుడు హిట్ అయితే నేనొక్కడినే ,ఆగడు లు సెంటిమెంట్ ని నిజం చేసాయి.
  • ఇక శ్రీకాంత్ అడ్డాల తీసిన సీతమ్మ వాకిట్లో హిట్ కొట్టాడు. ఇపుడు బ్రహ్మోత్సవం చేదు అనుభవాన్ని ఇచ్చింది.
  • ఈ ద్వితీయ ఆటంకం సెగ స్వయానా మహేష్ కి కూడా తగిలింది. అయన నిర్మాణంలో శ్రీమంతుడు హిట్ అయితే ,బ్రహ్మోత్సవం చేదు అనుభవాన్ని ఇచ్చింది.

అంతే కాకుండా మహేష్ హోం ప్రొడక్షన్స్ లో తీసిన వంశీ ,అర్జున్ , నాని ,అతిధి ,బ్రహ్మోత్సవం చేదు అనుభవాన్ని మిగిలి ఇవ్వగా , పోకిరి ,శ్రీమంతుడు రూపంలో హిట్లు దొరికాయి . ఈ పరిణామం తో మహేష్ రెండో సరి అటు దర్శకుడికి ఇటు నిర్మాత కి ఛాన్స్ ఇస్తాడో ఇవ్వడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here