తెలుగు రాష్ట్రాల్లో 100 మంది రైతు వాలంటీర్లకు ప్రశంస పత్రలు జారీ చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్

 

కరోన సంక్షోభంలో తెలుగు రైతుల సమస్యలు తీర్చడానికి సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ సంస్థ ఆధ్వర్యంలో సేవ్ ఫార్మర్ ఫస్ట్ అనే కార్యక్రమాన్ని ఎంతో మంది రైతుల సమస్యలను తీర్చటం జరిగింది.ఈ కార్యక్రమానికి మంచి ప్రశంసలు కూడా అందినాయి.మహుబూబాబాద్ జిల్లాలో ఒక సొసైటీ లో అవినీతికి పాల్పడుతున్న సీఈఓ గురించి అక్కడి రైతులు ఆన్లైన్ ద్వారా సేవ్ ఫార్మర్ సంస్థ కు ఫిర్యాదు చేయగా ,సంస్థ సభ్యులు అక్కడి కలెక్టర్ ద్వారా సదరు సీఈవో ని సస్పెండ్ చేయటం జరిగింది.ఇలా తెలుగు రాష్ట్రాల్లో చాలా సమస్యలను తీర్చటం జరిగింది.

ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో సమన్వయ కర్తలుగా పని చేసిన 100 మంది కి సంస్థ ప్రశంస పత్రాలు జారీ చేశారు.ఈ ప్రశంస పత్రం మీద ప్రముఖ వైద్యుడు,సామాజిక ఉద్యమకర్త ,రాజకీయ వేత్త పుంజాల వినయ్ కుమార్ గారి గుర్తింపుతో జారీ చేశారు.సంస్థ ఫౌండర్ రవీందర్ ర్యాడ మాట్లాడుతూ కరోనా సమయంలో రైతుల కోసం చేసిన ఈ కార్యక్రమంలో సమన్వయం చేసిన వారికి ,వీడియో కాన్ఫెరెన్సులో లో పాల్గొని సమస్యలకు పరిష్కారం దిశగా సలహాలు ఇచ్చిన వారికి,రైతుల కోసం సంస్ధ చేసిన వీడియో లో నటించిన వాళ్లకు ఈ ప్రశంస పత్రాలు ఇవ్వడం జరిగింది.

 

Tags
Show More

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close