పుంజాల వినయ్ గారి పుట్టినరోజు సందర్బంగా కౌలు రైతుకు సహాయం చేసిన సేవ్ గ్లోబల్ ఫార్మర్స్

0
228
పుట్టినరోజు వచ్చిందంటే చాలు కేకులు ,పార్టీలు అంటూ అనవసరపు ఖర్చులు చేస్తుంటారు. కాని ఈ మధ్య పెరిగిన సామజిక స్పృహ వల్ల పుట్టినరోజు న సామజిక కార్యక్రమాలు బాగా చేస్తున్నారు ఈ తరం యువత . కాని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ సంస్థ వాళ్ళు మాత్రం అన్నం పెట్టె రైతుకు సహాయం చేస్తూ వ్యవసాయానికి సాయం చేస్తున్నారు. ఆ మధ్య కౌలు రైతు సహాయం కూడా ప్రజల్లోకి బాగా వెళ్ళింది. ఇప్పటివరకు దాదాపు 10 మంది కౌలు రైతులకు సహాయం చేసిన ఈ సంస్థ ఈ రోజు ప్రముఖ డాక్టర్ ,సీనియర్ కాంగ్రెస్ నాయకులు ,బీసీ ఉద్యమ నేత పుంజాల వినయ్ కుమార్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని నిజామాబాద్ జిల్లాలోని బాల్కొండ మండలం నాగపూర్ గ్రామానికి చెందిన సంగేమ్ లచ్చ్చన్న అనే పేద కౌలు రైతుకు ఆర్థిక సహాయం చేయటం జరిగింది.
ఈ రైతు కుటుంబానికి ఎరువులకు కావాల్సిన పైకాన్ని సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు రవీందర్ ర్యాడా సౌజన్యంతో ,నాగపూర్ గ్రామానికి చెందిన రాకేష్ సంజీవ్, బాల్కొండ విడిసి అధ్యక్షులు అంబటి నవీన్ ,తోట నవీన్ సమన్వయంతో ఈ సహాయం చేశారు. సంస్థ ప్రతినిధులు మరియు రైతు సేవ్ గ్లోబల్ ఫార్మర్స్ ఫౌండేషన్ కు పెద్దన్నయ్య పాత్ర వహిస్తున్న డాక్టర్ వినయ్ గారు వందేళ్లు ఆరోగ్యంగా ఉండాలని శుభాకాంక్షలు తెలియజేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here