వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని ఐపీఎల్ మ్యాచులో వినూత్న ప్రదర్శన ఇచ్చిన రైతు సంస్థ

0
156

వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని,దళారి వ్యవస్థ ని రూపుమాపాలని, పసుపు రైతులకు మద్దతు ధర ఇవ్వాలని save global farmers టీం హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఐపీఎల్ మ్యాచులో జై జవాన్ జై కిసాన్ అని నినాదాలతో ప్రదర్శనలు చేసి స్టేడియంలో ఉత్సాహం రేకిత్తించారు.

గ్లోబల్ అధ్యక్షుడు రవీందర్ ర్యాడా మాట్లాడుతూ ప్రతి ఏడాది ఈ ఐపీఎల్ మ్యాచులో రైతుల సంక్షేమం కోసం awernsee కార్యక్రమాలు చేస్తామని,ఈసారి వృద్ధ రైతులకు పెన్షన్ ఇవ్వాలని,ఐపీఎల్ లో వచ్చే 1% ఆదాయాన్ని వృద్ధ రైతులకు చెందేలా చర్యలు తీసుకునేలా ప్రభుత్వాలు,క్రికెట్ సంఘాలు ముందుకు రావాలని డిమాండ్బుచేస్తున్నామని అన్నారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ కన్వీనర్ ఆకుల మోహన్, వైస్ ప్రెసిడెంట్ ఆర్మూర్ శ్రవణ్,నిజామాబాద్ జిల్లా కన్వీనర్ ఇజాప రవీందర్,రైతు నాయకుడు గణేష్ వెంకటి,మాల్యాల నర్సారెడ్డి,అశోక్ ,ఐటి కన్వీనర్ పుప్పాల ప్రవీణ్ తో పాటు మరో 30 మంది సభ్యులు ఆకు పచ్చ రూమళ్లతో ప్రదర్శనలు ఇచ్చి అందరిని ఆకర్షించారు.

ఈ సంస్థ ఆధ్వర్యంలో ఇప్పటి వరకు సభ్యుల పుట్టినరోజున కౌలు రైతుల సహయార్థం కౌలు రైతు ఛాలెంజ్,పసుపు మద్దతు ధర కోసం ఆన్లైన్ సంతకాల సేకరణ లాంటి వినూతన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here