అభిమానుల కోసం అభిమాని చేత తీయబడ్డ సినిమా సర్దార్

1
2038
Sardaar-GabbarSingh-Review
Sardaar-GabbarSingh-Review

ఫ్లాఫ్ లతో సతమౌతున్న పవన్ కళ్యాణ్ కి , దశాబ్ద కాలంగా సరైన హిట్ లేక పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని పైకి చెప్పుకోక తమలో తము మదన పడిన వాళ్ళకి 2012 లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో పెద్ద ఊరట . అభిమానులకే కాదు ప్రేక్షకులకు కూడా ఒక ఫుల్ మీల్స్ . తర్వాత వచ్చిన కెమరామెన్ కొంచెం తడబడ్డ విమర్శకుల తో ప్రసంసలు తెస్తే తర్వాత వచ్చిన అత్తారింటికి దారేది తో పవన్ ఇమేజ్ పిక్స్ కి వెళ్ళింది. గోపాల గోపాల లో పవన్ కామియో తో సినిమాను కాపాడాడు. ఐతే ఇపుడు గబ్బర్ సింగ్ ఫ్లేవర్ తో , తన స్క్రీన్ ప్లే తో అభిమానులకు అంకితమిస్తూ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ ఎలా ఉందో చూద్దాం.

కథ :
కథ ఆల్రెడీ ట్రైలర్ లో చెప్పసారు కాబట్టి ఇక్కడ ప్రస్తావించటం లేదు ఎందుకంటే ఇది ఒక రొటీన్ కథ .

విశేషణ
కథ పాతది అవ్వటం వలన కథనం మీద అంచనాలను ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. పవన్ కళ్యాణ్ రాసిన కథనం బాగున్నా సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే చిన్నబోయింది. కాని పవన్ విన్యాసాలతో కథనం గురుంచి మర్చిపోతారు . ముఖ్యంగా మంచేకడి సాంగ్ లో ,అబితాబ్ బచ్చన్ సాంగ్ కి ,వీణ స్టెప్ లో ,ఇంట్రడక్షన్ సీన్ లో ,ఇంటర్వెల్ బాంగ్ లో ఎమోషన్స్ ,అంతాక్షరి గ్యాంగ్ తో చేసే కామెడి బాగున్నాయి.

 • డైలాగుల గురించి మాట్లాడితే కచ్చితంగా అందరిని ఆకట్టుకుంటాయి ముఖ్యంగా  “భూమి ఎవడికి సొంతం కాదు ,ప్రతి ఒకడు భూమికే సొంతం”,”నేను ఒకడినే ,కానీ నాలోని సమూహం బయటకు ,భరించటం కష్టం “,”జనంలో ఉంటా …. జనంలా ఉంటా “,”కాపు కాసినపుడు గుర్తుకు రాలేని కులం ,అవసరం తీరాక గుర్తుకొచ్చిందా” లాంటివి ఆలోచింపచేస్తాయి.
 • టైటిల్స్ కార్డు పడ్డప్పుడు రాతన్పూర్ గ్రామంలో ప్రతి వస్తువుకి ప్రాణం వచ్చే విదంగా రావటం కొత్తగా ఉంది .
 • కాజల్ తో రొమాంటిక్ సన్నివేశాలు సూపర్బ్ అని చెప్పొచ్చు ,కాజాల తన మునుపటి చార్మ్ ని కోల్పోయిన కూడా పవన్ తో కెమిస్ట్రీ లో లేటు లేదు ,ముఖ్యంగా ప్యాలెస్ లో వాళ్ళిద్దరి మద్య సన్నివేశాలు బాగున్నాయి.
 • పవన్ గెట్ అప్ ల గురుంచి ,అయన స్టైల్ ప్రస్తావిస్తే అందరిని అలరిస్తాయి పోలీస్ డ్రెస్ లో సగం గడ్డం తో ,ఖద్దర్ డ్రెస్ లో ,ముఖ్యంగా కాజల్ ని కలవటానికి వెళ్ళినపుడు శేర్వాని వేసుకొని రాజా గెట్ అప్ లో వెళ్తాడు ,తీర వెళ్ళాక అక్కడ ఉన్న సెక్యూరిటీ బాయ్ వేసుకున్న డ్రెస్ పవన్ డ్రెస్ ఒకే విదంగా ఉండటంతో మంచి వినోదం వస్తుంది.
 • పవన్ ,బ్రహ్మి మద్య సన్నివేశాలు , వాళ్ళ మద్య వచ్చే కౌబాయ్ సీన్ బోర్ కొట్టించిన కూడా కౌబాయ్ ఎపిసోడ్ లో బ్రహ్మి పవన్ లాగా తుపాకీ తిప్పటం నవ్వు తెప్పిస్తుంది.
 • పోరాట సన్నివేశాలు ఐతే ఈ సినిమాలో ఎక్కువ మార్కులు పొందాయి ,ముఖ్యంగా ఇంట్రో ,ఇంటర్వెల్ సీన్ ,రావు రమేష్ ని విలన్ నుంచి కాపాడే సన్నివేశాలు బాగున్నాయి.
 • సంగీత్ సన్నివేశం అంతాక్షరి ల తీద్దామనుకున్న పెద్దగా ఆకట్టుకోలేదు ముఖ్యంగా డాన్స్ చేసిన పాటలను సరైనవి ఎన్నుకోలేదని అనిపిస్తుంది ,కాని చిరంజీవి ని అనుకరించే స్టెప్స్ బాగున్నాయి.
 • జబర్దస్త్ టీం ఉన్న కూడా అంత పెద్దగా ఆకటుకోలేదు.
 • మొదటి పార్ట్ లో పసివాడు పవన్ కళ్యాణ్ అయ్యాడు అని సినిమాను మొదలు పెట్టారు ,ఇక్కడ షోలే పోస్టర్ ని రగ్గు గా కప్పుకుంటు బాల గబ్బర్ సింగ్ పరిచయం బాగుంది.
 • మొదటి గబ్బర్ సింగ్ లో అలీ పాత్ర చాల బాగుంటుంది ,కానీ ఇక్కడ ఆయన పాత్ర పైన ఇంకా ద్రుష్టి పెట్టుంటే బాగుండేది .
 • పాటల గురుంచి మాట్లాడితే సుబానాళ్ళ ,తౌబా తౌబా పాటలు సూపర్బ్ ముఖ్యంగా సుబనాళ్ళ సాంగ్ లో పవన్ చెలరేగిపోయాడు ,తొలిప్రేమ లో ఏమి సోదరా ,తమ్ముడు లో ఏదోలా ఉంది పాటలను అభిమానులు గుర్తుకు తెచ్చుకుంటారు. కాని సెకండ్ హాఫ్ లో వచ్చిన చేపకళ్ళ ,ఖాకి డ్రెస్ సాంగ్ లలో ఏదో మిస్ అయినట్లు అనిపిస్తుంది ,సినిమా సరైన సమయానికి విడుదల చేయాలనే తాపత్రయంతో ఈ పాటలను దర్శకుడు లేకుండా విదేశాలకు వెళ్లి హడావిడిగా చిత్రీకరించారని అర్తం అవుతుంది ,ఈ సాంగ్ లో కాస్ట్యూమ్స్ కూడా సరిగా లేవు . ఆడియో విడుదల అయినప్పుడు ఈ రెండు సాంగ్స్ పైన అభిమానులకు చాల అంచనాలు వచ్చాయి కాని చిత్రీకరణలో అంచలనలు అందుకోదు.

ప్లస్ పాయింట్స్

 • పవన్ నట విశ్వరూపం
 • ప్రేమ సన్నివేశాలు
 • పోరాట దృశ్యాలు
 • పవన్ మార్క్ డాన్సులు
 • సుబానాల్ల ,తౌబా తౌబా సాంగ్స్
 • ఫస్ట్ హాఫ్
 • మాటలు
 • విలన్
 • దేవి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్
 • టైటిల్స్ కార్డు

మైనస్ పాయింట్స్

 • కథ
 • స్క్రీన్ ప్లే
 • దేవి మ్యూజిక్
 • గబ్బర్ సింగ్ అంచనాలను అందుకోకపోవటం
 • సెకండ్ హాఫ్ లో వచ్చే కొన్ని అనవసరపు సన్నివేశాలు
 • సెకండ్ హాఫ్ లో వచ్చే సాంగ్స్ హడావిడిగా చిత్రికరించటం

కబుర్లు రేటింగ్ :3.25/5
VERDICT: అభిమానుల కోసం అభిమాని చేత తీయబడ్డ సినిమా సర్దార్ గబ్బర్ సింగ్

……. సినీ జీవి

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here