అప్పట్లో అరుందతి ,ఇపుడు అనసూయ మద్యలో అక్కినేని

0
1466

గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో ఒక హాట్ టాపిక్ నడుస్తుంది. చెన్నై బ్యూటీ సమాంత తను ఒక తెలుగు హీరోని పెళ్లి చేసోకోబోతున్నట్లు ,తన పేరు N తో స్టార్ట్ అవుతుందని,అయన చాలా మనిషి అని ,నాకు ఆయనకు చాల రోజుల నుంచి స్నేహం ఉందని చెప్పింది. దీనితో అటు ఆఆ సినిమాకు మంచి పబ్లిసిటీ ,ఇటు మీడియాకు గాసిప్ వార్తలు ,మరోవైపు ప్రేక్షకులకు మసాలా టైం పాస్ దొరికినట్లైంది. ఐతే N ఎవరు అని ఇన్వెస్టిగేషన్ మొదలు చేసారు జనాలు . టాలీవుడ్ సంగతికొస్తే నితిన్ ,నాగ చైతన్య ,నిఖిల్ లు ముగ్గురు N తో మొదలయ్యే హీరోలు ఉన్నారు. వారిలో నిఖిల్ కి సమాంత కి పెద్దగా పరిచయం లేదు కాబట్టి ఆ లిస్టు లో నుంచి నిఖిల్ తీసేసారు జనాలు. ఇక చైతు ,నితిన్ మద్య పోటీని బలంగా కొనసాగించారు. ఎందుకంటే ఇద్దరితోనూ సమాంత సినిమాలు చేసింది . ఇద్దరితోనూ క్లోజ్ గా ఉంటుంది. నితిన్ తో అంతగా కాకపోయినా చైతన్య తో 3 సినిమాలు చేసింది కాబట్టి చైతు నే కావొచ్చు అని జనాలు అనుకున్నారు. అలాగని నితిన్ ని కూడా తకువ అంచనా వేయలేదు ఎందుకంటే అఆ సినిమా చేసారు కాబట్టి కొత్త వాళ్ళ మద్య స్నేహం కాస్త ప్రేమాగా మారిందేమో అని అనుకున్నారు.

కాని అ ఆ విడుదల అయ్యాక చైతు ,సమాంత ల కొన్ని రీసెంట్ ఫోటోలు బయటకు వచ్చాయి. దీనితో N అంటే నాగ చైతన్య అని అభిప్రాయానికి వచ్చారు. ఐతే ఇంకా అధికారికంగా ఏమి తెలియదు కాబట్టి దీన్ని ఇప్పటికి ఒక గాసిప్ న్యూస్ గానే పరిగణించాలి. అయినా సరే చైతు కి మొదటి నుంచి లవ్ కి సంబంధించి ఏదో ఒక గాసిప్ లో ఉంటూనే ఉన్నాడు. ఒకప్పుడు అరుందతి అనుష్క కి చైతుకి ఎఫైర్ ఉందంటే ఇపుడేమో అనసూయ (సమాంత) కి మద్య పుకార్లు వస్తున్నాయి . అందుకే అప్పట్లో అరుందతి ఇప్పుడేమో అనసూయ అని జోకులు వేసుకుంటున్నారు సినీ జనాలు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here