హెడ్డింగ్ కి,వార్తకు సంబంధం లేదు -సాక్షిలో పవన్ పై దుష్ప్రచారం

0
196

ఆంధ్రలో పవన్ కళ్యాణ్ ఒంటరి పోరాటం చేస్తున్నట్లు కనిపిస్తున్నాడు. బీజేపీ ,టీడీపీ దూరం కాగా సన్నిహితుడైన కెసిఆర్ కూడా దూరం కావటంతో ,ఎలాగో వైస్సార్ పార్టీ వ్యతిరేకం అవ్వటంతో మీడియా సపోర్ట్ లేకుండా ఒంటరిగా ప్రచారం చేస్తున్నాడు. ఈ మధ్య జగన్ మీడియాలో అయన పై బాబు కు తొత్తు అంటూ దుష్ప్రచారం ఎక్కువ చేస్తుంది. వాస్తవానికి అయన స్పీచుల్లో ఇద్దరినీ సమానంగా విమర్శించినా కూడా జగన్ మీడియా మాత్రం జగన్ ని విమర్శించే వార్తలను ఎక్కువ హైలైట్ చేస్తుంది. బాబు మీడియా కూడా పవన్ కళ్యాణ్ చేసే టీడీపీ వ్యతిరేఖ వార్తలను ప్రచురించకుండా కేవలం జగన్ వ్యతిరేఖ వార్తలను ప్రచురిస్తుంది(దీని వల్ల జగన్ పైన బురద చల్లడం,పవన్ కళ్యాణ్ మాకే మద్దతు ఇస్తున్నట్లు తప్పుడు సమాచారం పవన్ దఃగ్గరికి వెల్దామనుకునే టీడీపీ మద్దతుదారులను ,వోట్ వేద్దామనుకునే ఓటర్లను టీడీపీ లోనే ఉండేలా మైండ్ గేమ్ ఆడటం,ఇలాంటి మైండ్ గేములు ఆడటంతో బాబు సిద్ధహస్తుడు). ఐతే ఈ రోజు సాక్షిలో వచ్చిన పవన్ ప్రచార వార్త చూస్తే జనసేన పైన ఎలా బురద జల్లుతుందో తెలిసిపోతుంది.
వివరాల్లోకి వెళితే ఈ రోజు సాక్షి మెయిన్ పేపర్ రెండవ పేజీలో “టీడీపీ మద్దతు ఇస్తే కి అండగా ఉంటా” అని పవన్ అన్నట్లు ఒక వార్త వచ్చింది. కాని ఆ వార్తలో చూస్తే పవన్ కళ్యాణ్ టీడీపీ ని విమర్శించినట్లు 90% ఉంది. బాబుతో అయన ఎలా విభేదించాడో ,రావేలా కిషోర్ మా పార్టీలో కి వస్తే ఎలా అవమానించారో,టీడీపీ అవినీతిమయం అయిందని ,గుంటూరు లో అనారోగ్య సమస్యలపై గల్లా జయదేవ్ ఎందుకు మౌనంగా ఉంటాడని ,అమరావతిలో టీడీపీ కంచుకోట బద్దలు కొడతామని చెప్పారు. చంద్రబాబు తన కుమారుడ్ని సీఎం చేయటానికి ప్రజల్ని మోసం చేస్తున్నారు అని విమర్శించారు.

చూస్తుంటే ఆంధ్రలో మూడో పార్టీ ఉండొద్దని పాత పార్టీలు ఫిక్స్ అయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here