హైదరాబాద్ ఆభిమానులకు సచిన్ స్వీట్ వార్నింగ్

0
422

క్రికెట్ గ్రౌండ్ లో ,బయట ప్రశాంతంగా కనిపించే సచిన్ క్లాస్ పీకడటం ఏంటి అనుకుంటున్నారా?


అది కూడా అభిమానులపైనా … అవును . హైదరాబాద్ రోడ్ల పైన వెళుతున్న అభిమానులు సచిన్ ని చూసి తన అభిమాన క్రికెటర్ తో సెల్ఫీ దిగుదామని వచ్చారు,కాని సచిన్ మాత్రం ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చాడు.

విషయానికొస్తే ఈ నెల 5 న హైదరాబాద్ ఉప్పల్ స్టేడియం లో ఐపిఎల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ వచ్చిన సచిన్ కారులో వెళ్తుండగా సిగ్నల్ పడటంతో కార్ ఆగింది. అంతలో కార్ పక్క నుంచి బైక్ మీద వెళ్తున్న ఇద్దరు అభిమానులు బైక్ ఆపి సెల్ఫీ దిగుదామని ప్రయత్నం చేశారు. దానికి ఒప్పుకున్న సచిన్ ఆ యువకులు హెల్మె ట్ పెట్టుకోలేదని వాళ్లకు స్వీట్ క్లా స్ పీకాడు. వాళ్ళ దగ్గర ప్రామిస్ కూడా తీసుకున్నాడు. అంతే కాకుండా రోడ్ మీద వెళ్తున్న ఇతర ప్రయాణికులు కూడా హెల్మెట్ ధరించ లేకపోవటంతో హెల్మెట్ పెట్టుకోమని వాళ్లకు కూడా సూచించాడు. ఎంతైనా సచిన్ గ్రేట్ కదా….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here